Share News

సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ ‘హస్త’గతం

ABN , Publish Date - Feb 13 , 2026 | 11:40 AM

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.

సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ ‘హస్త’గతం
Sultanabad Municipality Election

పెద్దపల్లి జిల్లా, ఫిబ్రవరి 13: సుల్తానాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అత్యధిక స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులకు గానూ 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్, బీజేపీ, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు ఒక్కో స్థానాన్ని దక్కించుకున్నాయి. సుల్తానాబాద్ మున్సిపాటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.


వార్డుల వారీగా విజేతలు

  • 1వ వార్డు: కాంగ్రెస్ - ఈర్ల స్వరూప

  • 2వ వార్డు : కాంగ్రెస్ - గాజుల రాజమల్లు

  • 3వ వార్డు: బీజేపీ - కందునూరి సమత

  • 4వ వార్డు: కాంగ్రెస్ - బిరుదు కృష్ణ

  • 5వ వార్డు: కాంగ్రెస్ - గరిగే శోభారాణి

  • 6వ వార్డు: కాంగ్రెస్ - బాకం సాయికిరణ్

  • 7వ వార్డు: కాంగ్రెస్ - వర ప్రదీప్

  • 8వ వార్డు: కాంగ్రెస్ - చింతల రాజు

  • 9వ వార్డు: కాంగ్రెస్ - టికే ప్రభాకర్

  • 10వ వార్డు: కాంగ్రెస్ - అంతటి పుష్పలత

  • 11వ వార్డు: బీఆర్ఎస్ - కల్వల శంకరమ్మ

  • 12వ వార్డు: ఏఐఎఫ్‌బీపీ - అమీరిశెట్టి శ్రావణి

  • 13వ వార్డు: కాంగ్రెస్ - సిద్ధ తిరుపతి

  • 14వ వార్డు: కాంగ్రెస్ - వేగోళం పద్మ

  • 15వ వార్డు: కాంగ్రెస్ - గాదాసు మంజుల


ఇవి కూడా చదవండి...

కాపులను ఇబ్బంది పెట్టి 'తగ్గేదేలే' అంటూ సైగలా.. అంబటిపై పంచుమర్తి ఫైర్

చండూరులో కాంగ్రెస్ హవా.. 6 వార్డుల్లో విజయం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 13 , 2026 | 11:56 AM