మున్సిపల్ ప్రచారం.. మిగిలింది ఐదు రోజులే..
ABN , Publish Date - Feb 05 , 2026 | 11:08 AM
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండడంతో ఉమ్మడి. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు ఆయా మునిసిపాలిటీలలో ప్రచారం ఊపందుకుంది. ప్రచారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
ప్రచారం.. మిగిలింది ఐదు రోజులే
డివిజన్, వార్డుల్లో మొదలైన మైకుల మోత
నల్లగొండ, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండడంతో ఉమ్మడి. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు ఆయా మునిసిపాలిటీలలో ప్రచారం ఊపందుకుంది. ప్రచారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు మిర్యాలహడ, హాలియా, వందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల మునిసిపాలిటీల్లో ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది.
3వ వేదీన నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన వెంటనే అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. దీంతో స్టిక్కర్లతో పాటు బ్యాడ్జీలు ఏర్పాటు చేసుకొని రంగంలోకి దిగారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కరపత్రాలు తయారు చేసుకొని ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కొందరు అభ్యర్థులైతే ఏకంగా ఓటర్ల కాళ్లకు మొక్కుతూ వేయాలని వేడుకుంటున్నారు. ఒకసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే మంగళవారం రాత్రికి రాత్రే ప్రచార సామాగ్రిని సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా ఆటోలు, మైక్‌లను ఏర్పాటు చేసుకొని వార్డులు, డివిజన్లలో ప్రచారం చేస్తున్నారు. డీజే పాటలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.
పాటలతో హోరెత్తుతున్న ప్రచారం
ప్రధాన హార్షల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు అనేకమంది తమ పేరిట పాటలను తయారు చేయించుకున్నారు. కళాకారులు పెద్దఎత్తున ముందుకు వచ్చి తక్కువ ధరకే అంటే ఒక పాటకు రూ. 10వేలు ఇస్తే ఆయా అభ్యర్థుల పేరిట పాడుతూ కళాకారులు ఉపాధి పొందుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఆయా పాటలతో వార్డు, డివిజన్లలో దిగుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో పాల్గొంటున్న వారికి ఒక్కొకరికి రూ.400 వరకు చెల్లిస్తున్నారు. మరో ఐదు రోజులు పాటు ప్రచారం ఉండటంతో వారికి ఉపాధి లభించనుంది. ఈ డబ్బులు ఇంటి అద్దెలతోపాటు కుటుంబ అవసరాలకు సమకూరుతుండటంతో ఆయా వార్డులు, డివిజన్లలో మహిళలు, యువకులు, విద్యార్థిని, విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.
కాస్తా ఆర్థికంగా ఉన్న అభ్యర్థులు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం సమకూరుస్తున్నారు. పలు వార్డులలో, డివిజన్లలో అభ్యర్థులు ఓటర్లకు సిట్టింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా వీధుల్లో తమ వార్డులలో ఉన్న ఓటర్లకు చికెన్‌తో పాటు మద్యం ఏర్పాటు చేసి దావత్‌లు ఇస్తున్నారు. ముఖ్యమైన కార్యకర్తకు ఆ బాధ్యతలను అప్పగిస్తూ దావత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని డివిజన్లలో, వార్డులలో ఖరీవైన మద్యాన్ని సమకూర్చడం విశేషం. నల్లగొండ మునిసిపాలిటీ కార్పొరేషన్‌గా మారడంతో ప్రధాన పార్టీల్లో టికెట్ కోసం పోటీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఒక్కొక డివిజన్‌లో రూ.50 లక్షల నుంచి రూ.11లక్షలు కూడా ఖర్చూ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటుకు ఎంత ఇవ్వాలనే దానిపై అభ్యర్థులు ఇంక ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారు. తమ ప్రత్యర్థి ఓటుకు ఇచ్చిన డబ్బు కంటే మరో రూ.200ల నుంచి రూ.11000 అదనంగా ఇచ్చేందుకు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?
Read Latest Telangana News And AP News And Telugu News