MLA Rajgopal Reddy: నిరుద్యోగులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మద్దుతు.. హామీలు నెరవేర్చాలని డిమాండ్
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:58 PM
ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలని నిరుద్యోగ యువత చేస్తున్న డిమాండ్ సరైనదే అని ఎమ్మెల్యే తెలిపారు. నిరుద్యోగ పిల్లలకు దారి చూపించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం యువతకు ఉద్యోగ అవకాశాలు భర్తీ చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ(బుధవారం) ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు..
ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలని నిరుద్యోగ యువత చేస్తున్న డిమాండ్ సరైనదే అని ఎమ్మెల్యే తెలిపారు. నిరుద్యోగులకు దారి చూపించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. నిరుద్యోగులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. గ్రూప్-1 అవకతవకలపై ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత కష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ సీఎం కేసీఆర్‌ను గద్దె దించడంలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు. అమరవీరుల సాక్షిగా నిరుద్యోగులకు అండగా ఉంటానని తెలిపారు. వారి సమస్యలు వినేందుకు తానే వస్తానని వివరించారు. నిరుద్యోగుల నిరసనలకు తన పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు. నిరుద్యోగుల పట్ల ఏ సమస్య ఎదురైనా దానిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగవద్దని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..
సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు
డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు