Share News

Mallu Ravi on Rajagopal Reddy: రాజగోపాల్‌ రెడ్డి అంశం.. మల్లు రవి షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:58 PM

కాంగ్రెస్‌లో చేరికలను ఆహ్వానించామని ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్న నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరాలని సూచించారు. మీడియా ముందు అంతర్గత విషయాలు మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని మల్లు రవి హెచ్చరించారు.

Mallu Ravi on Rajagopal Reddy: రాజగోపాల్‌ రెడ్డి అంశం.. మల్లు రవి షాకింగ్ కామెంట్స్
Mallu Ravi Comments on Rajagopal Reddy

హైదరాబాద్, సెప్టెంబరు14 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) అంశంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి (Mallu Ravi) స్పందించారు. రాజగోపాల్‌ రెడ్డిపై ఫిర్యాదు వస్తే చర్చిస్తానని చెప్పుకొచ్చారు. రాజగోపాల్‌ రెడ్డిపై ఎవరో ఇంట్రెస్ట్ చూపిస్తే కమిటీ చర్చించదని స్పష్టం చేశారు. ఇవాళ(ఆదివారం) గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా మల్లు రవి మీడియాతో మాట్లాడారు.


అలాగే, సిద్దిపేట డీసీసీ నర్సారెడ్డిపై గజ్వేల్ దళితులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ విషయంపై నర్సారెడ్డిని వివరణ ఇవ్వాలని కోరామని పేర్కొన్నారు. పూజల హరికృష్ణపై ఫిర్యాదు వస్తే వివరణ అడిగామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లో (Congress) చేరికలను ఆహ్వానించామని తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్న నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరాలని సూచించారు. మీడియా ముందు అంతర్గత విషయాలు మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు మల్లు రవి.


మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డారని విమర్శించారు. కేటీఆర్ రాజకీయ నాయకుడు అయితే తాము సన్యాసులమా? అని ఫైర్ అయ్యారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్‌లో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారా అని ప్రశ్నించారు. గత పదేళ్లు ఏం చేశారో కేటీఆర్ చూసుకోని తమను ప్రశ్నించాలని హితవు పలికారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటే కేటీఆర్‌కు అంత ఇబ్బంది ఎందుకని మల్లు రవి నిలదీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్‌రెడ్డితో బీసీ కమిషన్‌ సభ్యుల భేటీ!

KTR Criticizes CM Revanth: చోటే భాయ్‌ని కాపాడుతున్న బడేభాయ్.. కేటీఆర్ విసుర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 14 , 2025 | 02:05 PM