Niranjan Meet CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డితో బీసీ కమిషన్ సభ్యుల భేటీ!
ABN , Publish Date - Sep 14 , 2025 | 06:08 AM
ఏడాది కాలంగా తెలంగాణ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకలాపాలను కమిషన్ చైర్మన్ నిరంజన్ సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు..
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): ఏడాది కాలంగా తెలంగాణ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకలాపాలను కమిషన్ చైర్మన్ నిరంజన్ సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. చైర్మన్ నిరంజన్‌తో పాటు కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, బాలలక్ష్మి శనివారం జూబ్లిహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు అవలంబించాల్సిన వ్యూహం పట్ల ఈ సందర్భంగా వారు సీఎంతో చర్చించినట్లు సమాచారం.