KTR Criticizes CM Revanth: చోటే భాయ్‌ని కాపాడుతున్న బడేభాయ్.. కేటీఆర్ విసుర్లు
ABN , Publish Date - Sep 14 , 2025 | 09:47 AM
రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ఘటన జరిగి 200రోజులు దాటినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
హైదరాబాద్, సెప్టెంబరు14 (ఆంధ్రజ్యోతి): రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ఘటన (SLBC Incident) జరిగి 200రోజులు దాటినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. 200రోజులు దాటినా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆరు మృతదేహాలను ఇప్పటికీ వెలికి తీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్.
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఎలాంటి పరిహారం కూడా అందించలేదని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram Project) చిన్నపాటి సమస్యలకే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపించి హంగామా సృష్టించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఎందుకు ఒక్క బృందాన్ని కూడా పంపలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్.
బీజేపీ బడే భాయ్(ప్రధానమంత్రి నరేంద్రమోదీ) ఎప్పుడూ కూడా.. తెలంగాణలో కాంగ్రెస్ (Congress) చోటే భాయ్‌ని(సీఎం రేవంత్‌రెడ్డి) ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన రోజున, ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంలో చనిపోయిన ఆ ఆరు కుటుంబాల సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. ఆ ఆరుగురి ప్రాణాలను బలిగొన్న వారికి శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ విధ్వంసం చేసిన ప్రతి దానితో పాటు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూలిపోవడానికి గల కారణాలకు తాము అధికారంలోకి రాగానే సమాధానాలు రాబడతామని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్‌రెడ్డితో బీసీ కమిషన్ సభ్యుల భేటీ!
గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
Read Latest Telangana News and National News