Justice Lakshman: అపరిష్కృత కేసులకు అందరూ బాధ్యులే
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:53 AM
చాలా కాలంగా వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారం కాకపోవడానికి అందరం బాధ్యులమని జిల్లా పోర్ట్ ఫోలియో జడ్జి, హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్ అన్నారు...
లోక్‌అదాలత్‌లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్
వరంగల్ లీగల్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): చాలా కాలంగా వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారం కాకపోవడానికి అందరం బాధ్యులమని జిల్లా పోర్ట్ ఫోలియో జడ్జి, హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్ అన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు, కక్షిదారులు కేసుల పరిష్కారానికి సమాన బాధ్యత తీసుకోవాలని సూచించారు. వరంగల్‌లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా మోటార్ ప్రమాద బీమా కేసులను పరిష్కరించారు. అనంతరం హైకోర్టు జడ్జి మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి కక్షిదారులు సహకరించాలని కోరారు. ఈమేరకు వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ భవనం ఎదుట మధ్యవర్తిత్వం ద్వారా జరిగే లాభాలకు సంబంధించిన బ్యానర్‌ను ఆవిష్కరించారు.