Rajgopal Reddy Controversy: రాజ్‌గోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నజర్
ABN , Publish Date - Aug 07 , 2025 | 08:34 AM
కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ నజర్ అయింది.రాజ్‌గోపాల్ రెడ్డితో గురువారం ఫోన్‌లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడనున్నారు. తరచూగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై రాజ్‌గోపాల్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు.
నల్గొండ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డిపై (Congress Munugodu MLA Komati Reddy) క్రమశిక్షణ కమిటీ నజర్ అయింది. రాజ్‌గోపాల్ రెడ్డితో ఇవాళ (గురువారం) ఫోన్‌లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి (Mallu Ravi) మాట్లాడనున్నారు. తరచూగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై విమర్శలు చేస్తున్నారు రాజ్‌గోపాల్ రెడ్డి.
ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కి నష్టం కలుగుతోందని భావిస్తోంది క్రమశిక్షణ కమిటీ. ఈరోజు ఫోన్‌లో మాట్లాడి కమిటీతో మాట్లాడే వరకు సైలెంట్‌గా ఉండాలని మల్లు రవి రాజ్‌గోపాల్ రెడ్డికి చెప్పనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తాను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు కూలంకషంగా చర్చిద్దామని రాజ్‌గోపాల్ రెడ్డికి సూచించనున్నారు మల్లు రవి. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు కలిగిస్తే ఊరుకునేది లేదని మల్లు రవి స్పష్టం చేశారు.
అయితే, గత కొంతకాలంగా రాజ్‌గోపాల్ రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని రాజ్‌గోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ వ్యాఖ్యలను ప్రతిసారి రాజ్‌గోపాల్ రెడ్డి తప్పుపడుతున్నారు. ఆయన వైఖరీ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తోందని హస్తం పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో క్రమశిక్షణ కమిటీ కూడా రాజ్‌గోపాల్ రెడ్డిపై అసహనం వ్యక్తం చేసింది. రాజ్‌గోపాల్ రెడ్డితో మల్లు రవి మాట్లాడి ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కబ్జాలను అరికట్టి చరిత్రను కాపాడతాం..
తెలంగాణ ఉద్యమ ఆయువుపట్టు గద్దర్
Read latest Telangana News And Telugu News