Share News

AV Ranganath: కబ్జాలను అరికట్టి చరిత్రను కాపాడతాం..

ABN , Publish Date - Aug 07 , 2025 | 07:50 AM

గండిపేట మండలంలోని పుప్పాలగూడ గ్రామంలో 200 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా అరికట్టి చరిత్రను కాపాడతామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అన్నారు.

AV Ranganath: కబ్జాలను అరికట్టి చరిత్రను కాపాడతాం..

- హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌

హైదరాబాద్‌ సిటీ: గండిపేట మండలంలోని పుప్పాలగూడ గ్రామంలో 200 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా అరికట్టి చరిత్రను కాపాడతామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) అన్నారు. దేవాలయాలకు, దర్గాకు 10 ఎకరాల వరకు ఇక్కడ భూమి ఇచ్చినట్టు చెబుతున్నందున రెవెన్యూ అధికారులతో కలిసి త్వరలో పరిశీలించి హద్దులు నిర్ధారించి కంచె ఏర్పాటు చేస్తామని తెలిపారు. పుప్పాలగూడలోని 452/1, 454/1 సర్వే నంబర్లలో ఉన్న కొండలను పరిరక్షించాలని కోరుతూ సొసైటీ టూ సేవ్‌ రాక్స్‌ ప్రతినిధులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో కమిషనర్‌ రంగనాథ్‌ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.


ఈ సందర్భంగా ఆయన వివిధ మతాలకు కేటాయించిన భూముల వివరాలను తెలుసుకున్నారు. సహజ సిద్థంగా ఉన్న గుట్టలను, 250 ఏళ్ల చరిత్ర కలిగిన కొండలను కాపాడితే ప్రకృతిని పరిరక్షించినట్లవుతుందన్నారు. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దనే హైకోర్టు ఉత్తర్వులను పరిశీలిస్తామన్నారు. అనంతరం నార్సింగ్‌ ప్రాంతంలో 160 ఎకరాల మేర ఉన్న చారిత్రక రాళ్ల గుట్టలను హైడ్రా కమిషనర్‌ పరిశీలించారు.


city3.2.jpg

నిథిమ్‌ చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్‌

నిథిమ్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌) ఆవరణలో ఉన్న చెరువును కూడా రంగనాథ్‌ బుధవారం పరిశీలించారు. ఒకప్పుడు చెరువులో బోటు షికారు సాగేది. ప్రస్తుతం చెరువు మురికి కూపంగా మారిపోవడంతో గత వైభవాన్ని తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిథిమ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వెంకటరమణతో రంగనాథ్‌ చర్చించారు. పూడికతీతతో పాటు చుట్టూ బండ్‌ నిర్మాంచాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

దొంగ డెత్‌ సర్టిఫికెట్‌తో ఎల్‌ఐసీకి టోకరా

Read Latest Telangana News and National News

Updated Date - Aug 07 , 2025 | 07:50 AM