Work from home: వారందరికీ వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వండి..
ABN , Publish Date - Aug 07 , 2025 | 08:13 AM
వర్షాల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వర్షాలకు ఐటీ కారిడార్‌లో వర్షాలకు రోడ్లన్నీ జలమయమవడంతో ట్రాఫిక్ సమస్యలు మరింత ఎక్కువవుతున్నాయి.
- ఐటీ కంపెనీలకు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సూచన
హైదరాబాద్ సిటీ: వర్షాల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Cyberabad Traffic Police) ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వర్షాలకు ఐటీ కారిడార్‌లో వర్షాలకు రోడ్లన్నీ జలమయమవడంతో ట్రాఫిక్ సమస్యలు మరింత ఎక్కువవుతున్నాయి. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ డాక్టర్ గజరావు భూపాల్ వాతావరణ శాఖ సమాచారం మేరకు సైబరాబాద్ పరిధిలోని ఐటీ కంపెనీల నిర్వాహకులకు బుధవారం సూచనలు చేశారు.

వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ఐటీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం(Work from home) ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా సమాచారాన్ని పోస్టు చేశారు. ఆఫీసులకు వచ్చిన ఉద్యోగులందరూ ఒకేసారి లాగవుట్ కాకుండా సాయంత్రం 4.30 గంటల నుంచి దశల వారీగా బయటకు రావాలని సూచించారు. సైబరాబాద్ పరిధిలో కురిసే వర్షంపై ఐటీ కంపెనీలకు, ఉద్యోగులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ట్రాఫిక్ నియంత్రణ కోసం చర్యలు చేపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
దొంగ డెత్ సర్టిఫికెట్‌తో ఎల్‌ఐసీకి టోకరా
Read Latest Telangana News and National News