Home » Jubilee Hills
అసెంబ్లీలో బీసీల వాణి వినిపిస్తానని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ...బీసీలు సంఘటితంగా ఉంటూ రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు ఇస్టారికల్ అని అభివర్ణించారు
హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన జూబ్లీహిల్స్‌లో కోట్లాది రూపాయల విలువూన స్థలాన్ని కబ్జా చేసేందుకు ఓ సినీ నిర్మాత యత్నించిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్.. నవీన్ చేత ప్రమాణం చేయించారు.
యజమాని ఇంట్లోనే దోపిడీ చేసేందుకు యత్నించిన కాపలాదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
అమెరికాలో బాత్రూంలు కడిగి వచ్చినోనికి హైదరాబాద్‌లో రౌడీలకు, పహిల్వాన్లకు తేడా తెల్వదని నవీన్‌యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ విమర్శించారు. కుమారుడి గెలుపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘నవీన్‌యాదవ్‌పై బీఆర్ఎస్, నాటి ఎమ్మెల్యే ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నిందలు మోపినా భరిస్తూ నిలబడ్డాడు. ఆ ఓర్పు నేటి విజయానికి దోహద పడింది.’ అంటూ యూసుఫ్‌గూడ బస్తీకి చెందిన వజీర్ లచ్చుమమ్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ విజయోత్సవతీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం శుక్రవారం రాత్రి యూసుఫ్‌గూడలో పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి.
యూసుఫ్‌గూడ గల్లీలో పెరిగిన కుర్రాడు. ఆర్కిటెక్చర్ పూర్తి చేశాడు. మొదట సొంత వ్యాపారం వైపు మొగ్గు చూపించాడు. తన ఇంట్లో ఎవరో ఒకరు రాజకీయంగా ఎదగాలని అతడి నాన్న భావించేవారు. తండ్రి ఆశయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించగానే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన నవీన్ యాదవ్(Naveen Yadav) ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘ఈ ఎన్నిక నా కోసమే వచ్చింది’ అని ఆయన తొలిసారి చేసిన వ్యాఖ్య ఇది. అప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదించకున్నా తొలి నుంచి తనదే గెలుపు అన్నట్లు ఆత్మవిశ్వాసం ప్రదర్శించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక సినిమా షూటింగ్ ముగిసిందనే భావనను రేకెత్తించింది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రధాన తారాగణంలా ప్రచారంలో దుమ్మురేపారు. ముఖ్యనాయకులు, కార్యకర్తలు.. కథలో మలుపు తిప్పే పాత్రలను పోషించారనే భావనను ప్రచారం ద్వారా కల్గించారు.