Hyderabad: అసలు.. ఐశ్వర్య ఎలా చనిపోయిందో...
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:00 AM
ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. అయితే.. ఆమెను భర్తే కొట్టిచంపాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.
- యువతి అనుమానాస్పద స్థితిలో మృతి
- ఫిట్స్ వచ్చి చనిపోయిందంటున్న భర్త
- అతనే కొట్టి చంపాడని బాధిత కుటుంబసభ్యుల ఆరోపణ, పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: పెళ్లయిన నెల రోజులకే ఓ నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఫిట్స్ వచ్చి చనిపోయిందని భర్త పేర్కొంటుండగా.. అతనే కొట్టి చంపాడని వివాహిత తండ్రి, మేనత్త ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గోల్డెన్ హైట్స్ కాలనీకి చెందిన రాజుకు జూబ్లీహిల్స్(Jubli Hills)కు చెందిన ఐశ్వర్య(22)తో నెల క్రితం వివాహమైంది.
ఆదివారం భార్యతో కలిసి భర్త జూబ్లీహిల్స్‌లో ఉండే అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ సంతోషంగా గడిపారు. సోమవారం తెల్లవారు జామున 5 గంటలకే గోల్డెన్ హైట్స్ కాలనీకి బైక్‌పై దంపతులు తిరిగొచ్చారు. వాతావరణం చల్లగా ఉండటంతో ఐశ్వర్యకు ఫిట్స్ వచ్చి కిందపడి మరణించిందని భర్త రాజు తెలిపాడు. ఇదే విషయాన్ని అత్తగారింటికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.

అయితే.. ఐశ్వర్యను భర్తే కొట్టి చంపాడని ఆమె తండ్రి లక్ష్మయ్య ఆరోపిస్తున్నాడు. కట్నం ఇవ్వలేదనే కోపంతో తరచూ కొట్టేవాడని ఐశ్వర్య తనతో చెప్పేదన్నాడు. ఆమె మరణంపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఐశ్వర్య సోదరుడు చింతల వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఎస్‌ఐ సుమన్ దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News