Share News

జూబ్లీహిల్స్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి శ్రీధర్ బాబు

ABN , Publish Date - Jan 26 , 2026 | 03:55 PM

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఈ నియోజకవర్గం నుంచి చదువుకున్న యువకుడిని నిలబెట్టి ప్రజలే గెలిపించారని పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu

హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): నగరంలోని జూబ్లీహిల్స్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) వ్యాఖ్యానించారు. ఈ నియోజకవర్గం నుంచి చదువుకున్న యువకుడిని నిలబెట్టి ప్రజలే గెలిపించారని పేర్కొన్నారు. రాజకీయాలు వ్యవస్థలో చాలా ముఖ్యమైనవని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అన్ని రోడ్డు పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం జూబ్లీహిల్స్‌లో పర్యటించిన ఆయన.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు.


జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు ప్రజలకు సేవ చేయాలనే తపన ఉందని, అలాంటి నాయకుడితో కలిసి అభివృద్ధి పనులు చేయించుకోవాలని ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. భవిష్యత్తులో నవీన్ యాదవ్ పెద్ద స్థాయి నాయకుడిగా ఎదుగుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ అంటే చాలా అభివృద్ధి చెందిన ప్రాంతమని అనుకున్నప్పటికీ, ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యం తీవ్రంగా పెరిగిందని, పరిశ్రమలను నగరానికి దూరంగా ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని వెల్లడించారు. అలాగే కమలాపురి కాలనీలో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి.


ఈ వార్తలు కూడా చదవండి...

జాగృతి పార్టీలో చేరండి.. మహేశ్ గౌడ్‌కు కవిత ఆఫర్

సింగరేణి స్కాంలో రేవంత్‌రెడ్డినే లబ్ధిదారుడు: హరీశ్‌రావు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 26 , 2026 | 04:19 PM