Jubilee Hills: అర్ధరాత్రి మాజీ ఐపీఎస్ ఇంటి ముందు అగంతకుడి న్యూసెన్స్
ABN , Publish Date - Jan 08 , 2026 | 10:10 AM
మాజీ ఐపీఎస్ ఇంటి ముందు ఓ ఆగంతకుడు హల్‌చల్ చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై మాజీ ఐపీఎస్ సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, జనవరి 8: నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ నివాసం ముందు అర్ధరాత్రి అగంతకుడు హంగామా సృష్టించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి మాజీ ఐపీఎస్‌కు చెందిన సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 30వ తేదీ అర్ధరాత్రి.. వీకే సింగ్ ఇంటి ముందు తర్బీజ్ అనే వ్యక్తి న్యూసెన్స్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రోడ్ నిర్మాణం పనుల కారణంగా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో రోడ్ బ్లాక్ అయ్యింది.
ఇదే విషయంపై అర్ధరాత్రి తర్బీజ్ హంగామా చేశాడు. వీకే సింగ్ ఇంటి గేట్‌ను కొడుతూ దాడి చేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అడ్డుకోబోయిన సిబ్బంది వెపన్‌ను తర్బీజ్ లాక్కునే ప్రయత్నం చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. అంతేకాకుండా ‘500 మందితో మీ ఇంటిపైకి వస్తా’ అంటూ వీకే సింగ్‌ను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై వీకే సింగ్‌కు పర్సనల్ సెక్యూరిటీగా ఉన్న జస్వంత్ జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
వివిధ మార్గాల్లో ‘సంక్రాంతి’ స్పెషల్ రైళ్లు
పూరి - తిరుపతి రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు..
Read Latest AP News And Telugu News