Share News

MLA Naveen Yadav: అసెంబ్లీలో బీసీల వాణి వినిపిస్తా..

ABN , Publish Date - Dec 05 , 2025 | 07:43 AM

అసెంబ్లీలో బీసీల వాణి వినిపిస్తానని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ...బీసీలు సంఘటితంగా ఉంటూ రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక గెలుపు ఇస్టారికల్‌ అని అభివర్ణించారు

MLA Naveen Yadav: అసెంబ్లీలో బీసీల వాణి వినిపిస్తా..

- జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌

హైదరాబాద్: బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల పెంపు, వారి సంక్షేమంపై అసెంబ్లీలో బీసీల వాణిని వినిపిస్తానని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌యాదవ్‌(Jubilee Hills MLA Naveen Yadav) తెలిపారు. స్థానిక సంస్థలు, గ్రేటర్‌ మన్సిపల్‌ ఎన్నికల్లో బీసీలకే సింహభాగం టికెట్ల కేటాయింపునకు కాంగ్రెస్‌ అగ్రనాయకత్వానికి తప్పక విన్నవిస్తానన్నారు. గురువారం సామ్రాట్‌ భవన్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం, బీసీ జేఏసీ జాతీయ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపుపై సంఘీభావం ప్రకటించారు. అనంతరం మీడియా సమావేశంలో నవీన్‌యాదవ్‌ మాట్లాడారు.


రాష్ట్రంలో బీసీల రాజకీయ విప్లవం, బీసీ నినాదం మరింత బలపడిందన్నారు. బీసీలకు సీట్లు కేటాయిస్తే అఖండ మెజార్టీని సాధిస్తారన్నారు. బీసీ సంఘాల కృషి ఫలితమే తనకు విజయం వరించిందన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అవకాశం కల్పించారన్నారు. బీసీలు సంఘటితంగా ఉంటూ రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. 42శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత విషయంలో బీజేపీ బీసీలను మోసం చేసిందని తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బీసీ జేఏసీ చైర్మన్‌ జాజుల శ్రీనివాస్ గౌడ్‌ మాట్లాడుతూ, బీసీలు గెలుపు గుర్రాలు, బీసీ విప్లవంతో స్థానిక ఎన్నికల్లో బీసీలు అధికంగా సీట్లు కైవసం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.


city3.2.jpg42 శాతం రిజర్వేషన్లను సాధించే వరకు పోరాటం ఉధృతం చేస్తామన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక గెలుపు ఇస్టారికల్‌ అని అభివర్ణించారు. ఇదే స్ఫూర్తితో బీసీలు రాజకీయంగా ఎదగాలన్నారు. బీసీ కుల సంఘాల జేఏసీ ఛైర్మన్‌ కుందారం గణేష్ చారి, బీసీ జేఏసీ జాతీయ వర్కింగ్‌ చైర్మన్‌ గుజ్జ కృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీల గెలుపే లక్ష్యంగా శ్రమిస్తామన్నారు. బీసీలను ఐక్యం చేసి రాజకీయంగా ఎదుగుతామన్నారు. నవీన్‌ యాదవ్‌కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం బీసీ సంఘాల ఆధ్వర్యంలో నవీన్‌యాదవ్‌కు శాలువా కప్పి సన్మానించారు. సమావేశంలో బీసీ జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్లు కులకచర్ల శ్రీనివాస్‌, విక్రంగౌడ్‌, బీసీ సంఘం రాష్ట్ర బాధ్యురాలు మణిమంజరి, బీసీ కుల సంఘాల అధ్యక్షులు శేఖర్‌, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వాడూ.. వీడూ.. ఎవడు

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు.. 15లోగా డిజైన్‌ కన్సల్టెంట్లతో ఒప్పందం

Read Latest Telangana News and National News

Updated Date - Dec 05 , 2025 | 07:43 AM