Kaleshwaram Barrage Renovation: కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు.. 15లోగా డిజైన్ కన్సల్టెంట్లతో ఒప్పందం
ABN , Publish Date - Dec 05 , 2025 | 03:14 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్థరణకు డిజైన్లతో పాటు సమగ్ర ప్రణాళికను అందించడానికి అర్హత సాధించిన సంస్థలు..
హైదరాబాద్, డిసెంబరు 4 (ఆంధ్ర జ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్థరణకు డిజైన్లతో పాటు సమగ్ర ప్రణాళికను అందించడానికి అర్హత సాధించిన సంస్థలు.. ఈ నెల 7లోగా ఫైనాన్షియల్ బిడ్లను దాఖలు చేయాలని నీటిపారుదల శాఖ కోరింది. మద్రాస్ ఐఐటీ- ఆర్వీ కన్సల్టెన్సీ- ఐప్రీసా్‌స(స్పెయిన్ కంపెనీ) జాయింట్ వెంచర్, ఆఫ్రీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, డీఎంఆర్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ కంపెనీల ప్రతినిధులతో గురువారం జలసౌధలో నీటి పారుదల శాఖ ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించి వారి అనుమానాలను నివృత్తి చేసింది. నేషనల్ డ్యామ్ ేసఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎ్‌సఏ) చేసిన సిఫారసులకు అనుగుణంగా డిజైన్లు అందించే సంస్థలతో ఒప్పందం చేసుకుంటామని తెలిపింది. ఫైనాన్షియల్ బిడ్లలో అర్హత సాధించిన సంస్థతో ఒప్పందం చేసుకునేలా.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని నీటిపారుదల శాఖ కోరనుంది. ఈ నెల 15లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కేంద్ర జలసంఘం చైర్మన్‌గా అనుపమ్ ప్రసాద్
కేంద్ర జల వనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఛైర్మన్‌గా అనుపమ్ ప్రసాద్‌ను కేంద్ర జల శక్తి శాఖ నియమించింది. ప్రస్తుత ఛైర్మన్‌గా ఉన్న అతుల్ జైన్ పదవీ విరమణ చేయడంతో.. సీడబ్ల్యూసీ సభ్యులుగా పనిచేస్తున్న అనుపమ్ ప్రసాద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.