Flights Diverted ON Heavy Rains: అలర్ట్.. విమానాల దారి మళ్లింపు.. అసలు విషయమిదే..
ABN , Publish Date - Sep 26 , 2025 | 03:33 PM
తెలంగాణతో పాటు హైదరాబాద్‌లో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు విమానాలను దారి మళ్లిస్తున్నట్లు శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
రంగారెడ్డి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణతో పాటు హైదరాబాద్ (Hyderabad)లో కూడా వర్షాలు (Heavy Rains) దంచికొడుతున్నాయి. భారీ వానల కారణంగా పలు విమానాల (Flights)ను దారి మళ్లిస్తున్నట్లు శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport) అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కోల్‌కతా - హైదరాబాద్ (6E. 6623), ముంబై - హైదరాబాద్ (6E6148), పూణే నుంచి శంషాబాద్‌కు రావాల్సిన మూడు ఇండిగో విమానాలను విజయవాడకు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
భారీ వర్షాల ప్రభావం ఇలాగే ఉంటే.. ఇంకా మరికొన్ని విమానాలను కూడా దారి మళ్లించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అలాగే వానల కారణంగా విమాన రాకపోకలకు కూడా ఆలస్యం అవుతోందని చెప్పుకొచ్చారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందికి గురవుతున్నారు. విమానాల రాకపోకలకు ఆలస్యం, మళ్లింపు విషయాన్ని ప్రయాణికులు గమనించాలని శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు సూచించారు.
మరోవైపు.. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన పలు విమానాలను దారి మళ్లించారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం అనుకూలించక ల్యాండింగ్ లోపం వచ్చింది. హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు ఏటీసీ అధికారులు నిరాకరించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో మూడు విమానాలు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో విజయవాడ నుంచి కర్నూల్‌కి రావాల్సిన ఇండిగో విమానం రద్దు అయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పార్టీని నాశనం చేసేందుకు బీర్ల ఐలయ్య కుట్ర
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన RRR భూ నిర్వాసితులు
For More TG News And Telugu News