Mother Dairy Elections: పార్టీని నాశనం చేసేందుకు బీర్ల ఐలయ్య కుట్ర
ABN , Publish Date - Sep 26 , 2025 | 02:02 PM
మదర డైయిరీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత కుమ్ములాట ఏర్పడింది. ఆ క్రమంలో ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్యపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మండిపడ్డారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 26: తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరో సారి రచ్చకెక్కాయి. ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్యపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే మందుల సామేల్ విలేకర్లతో మాట్లాడుతూ.. బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో కొందరు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని బీర్ల ఐలయ్యను పరోక్షంగా విమర్శించారు. మీ బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టకండంటూ బీర్ల ఐలయ్యకు ఈ సందర్భంగా ఆయన సూచించారు.
మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడితే మాత్రం.. నాయకులు, కార్యకర్తలు తగిన విధంగా బుద్ధి చెబుతారంటూ బీర్ల ఐలయ్యను మందుల సామేల్ తీవ్రంగా హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. రాజకీయ వ్యభిచారం చేస్తే మంచిదంటూ ప్రభుత్వ వీప్ ఐలయ్యకు ఎమ్మెల్యే మందుల సామేల్ సూచించారు.
సెప్టెంబర్ 27వ తేదీన ఎన్నికలు జరగనున్న మూడు డైరెక్టర్ల స్థానాల్లో రెండు చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు, ఒక చోట బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించుకునేలా ఇరు పార్టీ ఒప్పందం కుదుర్చుకున్నాయనే ప్రచారం సాగుతోంది. బద్ధ శత్రువులుగా ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కుదిరిన ఈ ఒప్పందం ప్రస్తుతం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మదర్ డైయిరీ పాలకవర్గం డైరెక్టర్ల స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు జరిపి విజేతలను ప్రకటించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వెల్లుల్లి తొక్క వల్ల ఇన్ని లాభాలా..?
తాటి కల్లు తాగడం.. లాభమా? నష్టమా?
For More TG News And Telugu News