Share News

Health Benefits Of Garlic Peel: వెల్లుల్లి తొక్క వల్ల ఇన్ని లాభాలా..?

ABN , Publish Date - Sep 26 , 2025 | 01:41 PM

వెల్లుల్లిలోనే కాదు.. వాటి తొక్కలో సైతం అనేక ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. వాటిని తీసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.

Health Benefits Of Garlic Peel: వెల్లుల్లి తొక్క వల్ల ఇన్ని లాభాలా..?
Health Benefits Of Garlic Peel:

ఈ సృష్టిలో పనికి రానిదంటూ ఏమి లేదు. అరటి తొక్క, నారింజ తొక్క, బత్తాయి తొక్కలోనే కాదు.. వెల్లుల్లి తొక్కలో సైతం భారీగా పోషకాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లితోపాటు వాటి తొక్కలో సైతం అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. అంతేకాదు.. వెల్లుల్లి తొక్కను ఆహార రుచిని పెంచడానికి ఉపయోగించవచ్చని వివరిస్తున్నారు.


  • ఈ తొక్కల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి.

  • ఈ తొక్కను సూప్‌లు, కూరల్లో వేసుకోవచ్చు. ఇది ఆహారంలో పోషక విలువలను పెంచుతుంది.

  • వెల్లుల్లి తొక్కలు ఉబ్బసం, పాదాల వాపును తగ్గించడంలో సహాయపడతాయి.


  • ఆస్తమా రోగులు వీటిని తీసుకంటే.. ఆ అనారోగ్య సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. (వెల్లుల్లి తొక్కలను మెత్తగా రుబ్బి.. ఉదయం సాయంత్రం తేనేతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది)


  • తామర, దురద తదితర చర్మ సమస్యలతో బాధపడే వారికి ఈ తొక్కలతో ప్రయోజనం పొందవచ్చు. (వెల్లుల్లి తొక్కలను నీటిలో కొన్ని గంటల పాటు నానబెట్టి.. ఆ నీటిని చర్మ వ్యాధులు ఉన్న ప్రాంతంలో శుభ్రం చేయాలి. అలా పలుమార్లు చేయడం వల్ల చర్మ సమస్యలు దూరమవుతాయి.)


  • పాదాల వాపు, నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. (వెల్లుల్లి తొక్కలను నీటిలో మరిగించాలి. కొద్దిగా చల్లారిన తర్వాత అంటే.. గోరు వెచ్చని నీటిలో మీ పాదాలను కొద్ది సేపు అందులో నానబెట్టాలి. దీంతో పాదాల వాపు సమస్య తగ్గుతుంది.)


  • జుట్టు సమస్యలను సైతం తగ్గిస్తుంది. (వెల్లుల్లి తొక్కలను నీటిలో మరిగించాలి. అనంతరం అవి చల్లబడిన తర్వాత జుట్టుకు అప్లై చేయాలి. లేకుంటే వాటిని మెత్తని పేస్టుగా చేసి.. జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత షాంపుతో తలను శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల చుండ్రు, దురద నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.)


Updated Date - Sep 26 , 2025 | 01:41 PM