Share News

Cataract Risk Factors: కాటరాక్ట్ ముప్పును పెంచే ఫుడ్స్.. వీటి జోలికి అస్సలు వెళ్లొద్దు

ABN , Publish Date - Sep 26 , 2025 | 01:20 PM

కంటి శుక్లాల రిస్క్‌ను పెంచే ఫుడ్స్ కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటి జోలికి అస్సలు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. మరి ఈ ఫుడ్స్ ఏవో కూలంకషంగా తెలుసుకుందాం.

Cataract Risk Factors: కాటరాక్ట్ ముప్పును పెంచే ఫుడ్స్.. వీటి జోలికి అస్సలు వెళ్లొద్దు
Cataract Risk Foods

ఇంటర్నెట్ డెస్క్: కంటిలోని లెన్స్ మసక బారటాన్ని కాటరాక్ట్ (కంటి శుక్లాలు) అని అంటారు. కంటి చూపు పోవడానికి ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటి. వయసు మళ్లిన వాళ్లల్లో ఎక్కువగా కనిపించే సమస్య ఇది. అయితే, వయసుతో పాటు పుట్టుకతో వచ్చే లక్షణాలు, ఆహారం కూడా కాటరాక్ట్ ముప్పును పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి కాటరాక్ట్ ముప్పును పెంచే ఫుడ్స్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం (Catarack Risk Increasing Foods).

ప్రాసెస్డ్, ఫ్రైడ్ ఫుడ్స్

బాగా వేయించిన, ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్, రిఫైన్డ్ నూనెలు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను పెంచి కంటి లెన్స్‌లోని ప్రొటీన్లు త్వరగా ధ్వంసం అయ్యేలా చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.

చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారాలు

చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారాలు, పానీయాల కారణంగా లెన్స్‌లో గ్లైకేషన్ పెరుగుతుంది. అంటే ప్రొటీన్లకు షుగర్ మాలిక్యూల్స్ జతకూడతాయి. ఇది చివరకు కాటరాక్ట్ ముప్పును పెంచుతుంది. కాబట్టి, చాక్లెట్లు, సోడాలు వంటి ఫుడ్స్ జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది.

ప్రాసెస్డ్ మాంసాహారం

ప్రాసెస్డ్ మాంసాహారంలో కూడా శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కూడా ఆక్సిడేటివ్ ఒత్తిడిని పెంచి లెన్స్‌లోని ప్రొటీన్లు ధ్వంసం అయ్యేలా చేస్తాయి. ఫలితంగా కాటరాక్ట్ ముప్పు పెరుగుతుంది.


సోడియం ఎక్కువగా ఉన్న ఆహారాలు

ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ తప్పుతుంది. బీపీ పెరిగి అంతిమంగా కంటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి, వీటి జోలికి అస్సలు వెళ్లొద్దని నిపుణులు చెబుతున్నారు.

వైట్ బ్రెడ్

వైట్ బ్రెడ్, ఇతర రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం వల్ల రక్తంలో చక్కెర స్థాయిల్లో బాగా ఎగుడుదిగుడు అవుతాయి. ఇది కూడా కంటి లెన్స్‌లో గ్లైకేషన్ పెంచి కాటరాక్ట్ ముప్పును పెంచుతుంది. ఈ ముప్పు తగ్గించుకునేందుకు రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ జోలికి అస్సలు వెళ్లొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మద్యం

మద్యపానం కూడా ఒంట్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను పెంచుతుంది. తేమ తగ్గి డీహైడ్రేషన్ మొదలవుతుంది. అంతిమంగా ఇవన్నీ అనారోగ్యాలకు దారి తీస్తాయి. కాటరాక్ట్ ముప్పును తగ్గించుకునేందుకు సహజసిద్ధమైన తృణధాన్యాలు, ప్రొటీన్లు ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

స్మార్ట్ ఫోన్‌తో బీపీ చెక్ చేసుకునే అవకాశం ఉందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..

40ల్లో ఉన్న మహిళలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది

Read Latest and Health News

Updated Date - Sep 26 , 2025 | 01:29 PM