Palm Toddy: తాటి కల్లు తాగడం.. లాభమా? నష్టమా?
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:26 PM
తాటి కల్లు చాలా మంది తాగుతారు. అయితే ఆరోగ్యానికి మంచిదని కొందరు చెబుతారు. కానీ ఇది ఆరోగ్యానికి హానికరమని మరికొందరు అంటారు. మరి వీరిలో ఎవరి మాటలు నమ్మాలంటే..
తాటి కల్లు అంటే.. ఇదో రకం మద్యం అని అంతా అనుకుంటారు. ఇది తాగితే.. మద్యంలాగా మత్తు ఆవరిస్తోందని భావిస్తారు. కానీ తాటి కల్లు తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఇది ఒక రకమైన మద్యం వంటింది. దీనిని మితంగా సేవించాలని చెబుతారు.
తాటి కల్లు వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు..
తాటి కల్లులో పోటాషియం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రించి గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తోంది.
వీటిలో సహజ ఎంజైములు, ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది.
వీటిలో గ్లూకోజ్, కార్బోహైడ్రేట్లు ఉండడం వల్ల శరీరానికి తక్షణ శక్తి ఇస్తుంది.
తాటి కల్లులో విటమిన్ బి,సిలు ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
వీటిలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
వేసవిలో తాటి కల్లు తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గి.. చలువ చేస్తోంది.
రక్తహీనత వంటి సమస్యలను తగ్గించడంలో తాటి కల్లు సహాయపడుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏదో తేడా కొడుతుంది.? జగన్ కు బొత్స భయం
అసెంబ్లీలో జగన్ అరాచకాలను బయటపెట్టిన మంత్రి సత్యకుమార్
For More Health News And Telugu News