Kadiyam Srihari: ఏ ప్రాజెక్టును పట్టించుకోని కేసీఆర్ సర్కారు
ABN , Publish Date - Sep 01 , 2025 | 03:54 AM
కేసీఆర్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన శ్రద్ధ.. మిగతా ప్రాజెక్టుల మీద పెట్టలేదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు.
అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే కడియం
మేడిగడ్డ ప్రాజెక్టు మేడిపండు లాంటిది: యశస్వినీ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన శ్రద్ధ.. మిగతా ప్రాజెక్టుల మీద పెట్టలేదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. పంట మార్చే క్రమంలో ఒక రైతు పత్తి చేనును తొలగిస్తే యూరియా కొరత వల్లే తొలగించారని ఎర్రబెల్లి దయాకర్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ ప్రాజెక్టు మేడిపండు లాంటిదని ఎద్దేవా చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ రైతులను మభ్యపెట్టే విధంగా బీఆర్‌ఎస్ నేతలు యూరియాపై రచ్చ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.