Share News

Kadiyam Srihari Counter on KCR: కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుంది: కడియం శ్రీహరి

ABN , Publish Date - Sep 05 , 2025 | 01:43 PM

కాళేశ్వరంలో కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఆస్తికి సంబంధించినవేనని కడియం శ్రీహరి ఆరోపించారు.

Kadiyam Srihari Counter on KCR:  కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుంది: కడియం శ్రీహరి
Kadiyam Srihari Counter on KCR

జనగామ, సెప్టెంబరు5 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై (KCR) స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) హాట్ కామెంట్స్ చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఆస్తికి సంబంధించినవేనని ఆరోపించారు. ఇవాళ(శుక్రవారం) జనగామ జిల్లాలోని లింగాల గణపురం మండలం నవాబుపేట రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేశారు. అనంతరం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు.


పదేళ్ల అధికారంలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుందని విమర్శించారు. ధరణిని అడ్డుపెట్టుకొని వేల ఎకరాల భూములు కబ్జా చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును (Kaleshwaram Project) అడ్డుపెట్టుకొని కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు సంపాదించిందని ఆక్షేపించారు. వేల ఎకరాల భూములు, వేలకోట్ల రూపాయలు పంచుకునే క్రమంలో కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు కడియం శ్రీహరి.


కేసీఆర్ కుటుంబ గొడవలతో తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం కేసీఆర్ బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయినందుకేనని షాకింగ్ కామెంట్స్ చేశారు. కవిత లిక్కర్ కేసులో విచారణను ఎదుర్కోవడం అనేక రోజులు జైల్లో ఉండటం సరైన పద్ధతి కాదని తాను బయటకు వచ్చానని చెప్పుకొచ్చారు. అవినీతి డబ్బులను పంచుకోవడంలో వారి మధ్య జరిగిన గొడవే తప్పా.. మరి ఇంకా ఏం లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్‌ఎస్‌ పార్టీకి కేసీఆరే సుప్రీం: హరీష్‌రావు

గణేష్ ఉత్సవాల్లో రాజకీయ రగడ.. మంత్రి కోమటిరెడ్డిని అడ్డుకున్న బీజేపీ నేతలు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 05 , 2025 | 01:51 PM