Share News

BJP VS Congress: గణేష్ ఉత్సవాల్లో రాజకీయ రగడ.. మంత్రి కోమటిరెడ్డిని అడ్డుకున్న బీజేపీ నేతలు

ABN , Publish Date - Sep 05 , 2025 | 11:31 AM

నల్లగొండ పాతబస్తీ ఒకటో నంబర్ వినాయకుడి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగిస్తుండగా బీజేపీ నేతలు అడ్డుకున్నారు. గణేష్ ఉత్సవాల్లో రాజకీయాలు మాట్లాడటమేంటని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

BJP VS Congress: గణేష్ ఉత్సవాల్లో రాజకీయ రగడ.. మంత్రి కోమటిరెడ్డిని అడ్డుకున్న బీజేపీ నేతలు
Nalgonda Political Clash

నల్లగొండ, సెప్టెంబరు5 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ పాతబస్తీ ఒకటో నంబర్ వినాయకుడి వద్ద ఇవాళ(శుక్రవారం) తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ప్రసంగిస్తుండగా బీజేపీ నేతలు అడ్డుకున్నారు. గణేష్ ఉత్సవాల్లో రాజకీయాలు మాట్లాడటమేంటని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తోఫులాట జరిగింది.


ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కి వర్షిత్ రెడ్డిని తరలిస్తుండగా పోలీసులను బీజేపీ కార్యకర్తలు, నేతలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో వారిని అక్కడి నుంచి పోలీసులు పంపించి వేస్తున్నారు. అన్యాయంగా బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించాలి

‘గే’ యాప్‌ ‘గ్రైండర్‌’ ద్వారా డ్రగ్స్‌ విక్రయం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 05 , 2025 | 11:36 AM