Home » Komati Reddy Venkat Reddy
కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ నాటికి మూడేళ్లు పూర్తవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దేశంలో లేని పథకాలను ప్రజాప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోదాడ మండలం ద్వారకుంట దగ్గర కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన విషయం తెలిసిందే.
సనత్‌నగర్ టిమ్స్‌కు మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే తన లక్ష్యమని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఎస్ఎల్బీసీ సొరంగం మార్గం ద్వారా రెండు పంటలకు నీరు ఇచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు.
తోటి ఉద్యమ సహచరుడు మృతి చెందితే వెళ్లని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ సీఎం ఎలా అవుతారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
తెలంగాణలో రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర టెలివిజన్ అవార్డుల (TGSTA) పేరు, లోగో తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా ఉండాలని సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో టెలివిజన్ అవార్డ్ కమిటీ సభ్యులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణలో టీవీ అవార్డులకు శ్రీకారం చుట్టేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. అవార్డుల పేరు, లోగో, కేటగిరీలపై కమిటీతో కీలకంగా చర్చించారు.
మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆలేరు, భువనగిరి ప్రజల పాపం తగిలే కేసీఆర్ కాలు విరిగి ఫాంహౌస్ పాలయ్యారని విమర్శించారు.
రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) విధానంలో చేపట్టబోయే రోడ్ల పనులకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ పడింది. నల్లగొండ జిల్లా కనగల్ మండలంలో హ్యామ్ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో....