Share News

Bhutpur Development: మహబూబ్‌నగర్‌లో మంత్రుల పర్యటన.. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:36 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి జరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలు వెనకబడిన జిల్లాలని.. ఇప్పుడు ఈ రెండు జిల్లాలు అభివృద్ధి దిశగా వెళ్తున్నాయన్నారు.

Bhutpur Development: మహబూబ్‌నగర్‌లో మంత్రుల పర్యటన.. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
Bhutpur Development

మహబూబ్‌నగర్, జనవరి 14: జిల్లాలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy), వాకిటి శ్రీహరి(Minister Vakati Srihari) పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా భూత్పూర్‌లో వివిధ అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం.. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్, నల్గొండలు వెనకబడిన జిల్లాలని.. ఇప్పుడు ఈ రెండు జిల్లాలు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంత బిడ్డ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. నేడు రూ.60 కోట్లతో మూడు మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. అలాగే కురుమూర్తి స్వామి దేవాలయానికి ఘాట్ రోడ్డు కోసం రూ.140 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.


కేసీఆర్‌పై విమర్శలు..

కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పనులు పూర్తయినట్లు బీఆర్‌‌ఎస్ చెబుతోందని.. కానీ రూ.27000 కోట్లు మాత్రమే ఎలా ఖర్చు అయిందని ఆయన ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణపై కేసీఆర్‌కు ప్రేమ లేదని.. అందుకే ఇక్కడ కేవలం మూడు సీట్లు మాత్రమే వచ్చాయని మంత్రి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా దక్కలేదని విమర్శించారు.


కాంగ్రెస్‌‌కు మద్దతివ్వండి...

20 రోజుల్లో మునిసిపల్ ఎన్నికలు, త్వరలో జిల్లా పరిషత్ ఎన్నికలు రాబోతున్నాయని కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలిపారు. ఈ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చేవారని.. కానీ రేవంత్ రెడ్డి ఎల్లవేళలా ప్రజల్లోనే ఉంటారని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూత్పూర్ ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ వ్యాప్తంగా అంబరాన్నంటిన భోగి సంబరాలు

మహిళా ఐఏఎస్‌పై అసభ్య కథనాలు.. సీసీఎస్ దూకుడు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 14 , 2026 | 12:51 PM