అధిక ఫీజులతో దోచుకుంటున్నారు.. అంతా దొంగలే: కోమటిరెడ్డి
ABN , Publish Date - Jan 27 , 2026 | 02:45 PM
తాను విద్యాశాఖ మంత్రిని అయితే కార్పోరేట్ స్కూళ్లను మూసివేయిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. విద్య వ్యాపారం కావద్దని తేల్చిచెప్పారు. బొట్టుగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ఆయన ప్రారంభించారు.
నల్లగొండ, జనవరి 27: కార్పొరేట్ స్కూళ్లలో అధిక ఫీజులతో ప్రజలను దోచుకుంటున్నారని.. తాను విద్యాశాఖ మంత్రి అయితే సదరు స్కూళ్లను మూసివేయిస్తానని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. విద్య వ్యాపారం కావద్దని తేల్చిచెప్పారు. మంగళవారం నల్గగొండ టౌన్‌లోని బొట్టుగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ఆయన ప్రారంభించారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘నల్లగొండ ప్రజల రుణం తీర్చుకోవడానికే నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ చేశా. కేంద్రం నుండి నిధులు తెచ్చి నల్లగొండ రూపు రేఖలు మారుస్తా’..
‘నేను ప్రధాని నరేంద్ర మోదీని కలిస్తే వెయ్యి, 2 వేల కోట్ల రూపాయల నిధులైనా ఇస్తారు. విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుంది. నాకు ఉత్సాహం ఉంటే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తా. లేకుంటే ప్రతీక్ స్కూల్‌లో విద్యార్థులను చదివిస్తూ జీవితం గడుపుతా. ఈ స్కూల్ విద్యార్థులను ఆణిముత్యాల్లా తీర్చిదిద్ది ఐఏఎస్, ఐపీఎస్‌లుగా తయారు చేయాలి. నిజాయితీగా బతికా.. పేద వారికి సహాయం చేశా. చదువంటే ర్యాంకులు మాత్రమే కాదని ఓ ఆలోచన చేశాం. విద్యకు ప్రాధాన్యత ఇచ్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నాం. బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా డిజిటల్ విద్యను అందిస్తాం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. కస్టమర్లకు ఇక్కట్లు
టీ20 ప్రపంచకప్ నుంచి పాక్ తప్పుకుంటే.. తప్పవీ శిక్షలు!