Komatireddy Venkat Reddy: కన్ఫ్యూజన్‌లో కవిత: మంత్రి కోమటిరెడ్డి
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:07 PM
మంత్రి పదవి కోసం తాను ఏ రోజు పాకులాడలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి పదవి కావాలంటూ తాను ఎవరిని అడగలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవినే తాను త్యాగం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
హైదరాబాద్, జనవరి 02: తనకు సీఎం రేవంత్ రెడ్డి అంటే గౌరవమని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఎవరు ఏమన్నా అంటే కౌంటర్ ఇస్తానన్నారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మంత్రి పదవి కోసం తాను ఏ రోజు పాకులాడలేదని చెప్పారు. మంత్రి పదవి కావాలంటూ తాను ఎవరిని అడగలేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవినే తాను త్యాగం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తనకు, తన తమ్మునికి మధ్య ఎటువంటి గొడవలు లేవని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.
ఇక బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ సీఎం స్పందనపై కవిత శుక్రవారం కాస్తా ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ వదిలిన బాణం కవిత అని ఆయన అభివర్ణించారు. కవిత కన్ఫ్యూజన్‌లో ఉండి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తోందని వ్యంగ్యంగా అన్నారు. కవిత ఏ పార్టీలో ఉందో స్పష్టం చేయాలంటూ మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. తన తండ్రి మీద సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆమె.. హరీష్ రావు మీద చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదు? అంటూ కవితను ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
జరిగింది ఇది..
జనవరి 1వ తేదీ గురువారం సాయంత్రం ప్రజాభవన్‌లో జలాలు - నిజాలు అంశంపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు. దీనికి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పార్టీలోని సీనియర్లు పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వల్లే తగ్గిదంటూ సీఎం రేవంత్ కాస్తా ఘాటుగా స్పందించారు. సీఎం చేసిన వ్యాఖ్యలపై కవిత మండిపడ్డారు. కవిత వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కలెక్టర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
For More TG News And Telugu News