BR Ambedkar Konaseema: కలెక్టర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..
ABN , Publish Date - Jan 02 , 2026 | 10:46 AM
అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.
అమలాపురం, జనవరి 02: అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద డ్రాగన్ పడవ పోటీల ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కింగ్ బోట్‌పై ఆయన వెళ్తుండగా.. అది అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ నీటిలో పడిపోయారు. లైఫ్ జాకెట్ వేసుకోవడంతో ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు.
అనంతరం.. కలెక్టర్ మహేశ్ కుమార్‌ను మరో బోట్‌లో మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత యథావిధిగా అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ మీనా, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
కుమారుడితో కలిసి నూతిలో దూకిన తల్లి.. ఇద్దరు మృతి
For More AP News And Telugu News