Share News

Komatireddy Meets CM Chandrababu: తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. చంద్రబాబును కలిసిన కోమటిరెడ్డి

ABN , Publish Date - Dec 05 , 2025 | 05:01 PM

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు.

 Komatireddy Meets CM Chandrababu: తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. చంద్రబాబును కలిసిన కోమటిరెడ్డి
Minister Komatireddy Meets CM Chandrababu

అమరావతి, డిసెంబరు5 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును (AP CM Nara Chandrababu Naidu) తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Telangana Minister Komatireddy Venkata Reddy) ఇవాళ (శుక్రవారం) కలిశారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. అనంతరం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.


సీఎం చంద్రబాబును గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించాం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

HAM roads Telangana

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు తాను అమరావతికి వచ్చానని తెలిపారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ఏర్పాటయ్యాక పక్కనే రహేజా మైండ్ స్పేస్‌లో ఐదు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వివరించారు. బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఐటీ రంగంలో రెండో స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్‌ నిర్వహిస్తోందని.. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.


ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత చంద్రబాబు నాయుడును ఆహ్వానించేందుకు వచ్చానని తెలిపారు. సీఎం చంద్రబాబు తప్పకుండా సమ్మిట్‌కు హాజరవుతారనే తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో కోకాపేట ఏరియాలో భూముల విలువ రూ.100 కోట్లు పలుకుతున్నాయని వివరించారు. అందుకే ఆదిభట్ల వద్ద ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తయిన విద్యార్థుల్లో స్కిల్స్ ఉండటం లేదని... వారికి పలు అంశాలపై అవగాహన కల్పించేలా తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం..!

మరో విమానానికి బాంబు బెదిరింపు.. అధికారులు అలర్ట్

For More TG News And Telugu News

Updated Date - Dec 05 , 2025 | 05:52 PM