Bomb Threat: మరో విమానానికి బాంబు బెదిరింపు.. అధికారులు అలర్ట్
ABN , Publish Date - Dec 05 , 2025 | 11:06 AM
ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు వ్యవహారం కలకలం రేపుతోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానంలో బాంబు పెట్టినట్లు ఆగంతకులు బెదిరించారు.
హైదరాబాద్, డిసెంబరు5 (ఆంధ్రజ్యోతి): ఎమిరేట్స్ విమానానికి (Emirates Flight) బాంబు బెదిరింపు (Bomb Threat) వ్యవహారం కలకలం రేపుతోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు (Shamshabad Airport) బాంబు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానంలో బాంబు పెట్టినట్లు ఆగంతకులు బెదిరించారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమిరేట్స్ విమానం అత్యవసర ల్యాండింగ్‌కు ఏర్పాటు చేశారు.
EK-526 విమానాన్ని పేల్చేస్తామంటూ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆగంతకులు మెయిల్ పంపించారు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు హెలిప్యాడ్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. మరోవైపు బాంబు స్క్వాడ్, పోలీసులు ఎయిర్‌పోర్టు పరిసరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
బాంబు బెదిరింపు విషయం బయటకు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే, గతంలోనూ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. అసలు ఈ బెదిరింపులకు ఎవరు పాల్పడుతున్నారు..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. తాజా బెదిరింపుల నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలో భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు.
ఆందోళన...
మరోవైపు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 92 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ముందుగా బుక్ చేసుకున్నసర్వీసుల రద్దుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొచ్చి వెళ్లాల్సిన విమానాల ఆలస్యంతో అయ్యప్ప స్వాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోర్డింగ్ గేటు దగ్గర బైఠాయించి అయ్యప్ప స్వాములు నిరసన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ.. ఎందుకంటే
నా వ్యాఖ్యలపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
For More TG News And Telugu News