CM Revanth Meets PM Narendra Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ.. ఎందుకంటే
ABN , Publish Date - Dec 03 , 2025 | 02:47 PM
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. బుధవారం పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
ఢిల్లీ, డిసెంబరు3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ(బుధవారం) పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో (PM Narendra Modi) ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ -2047 గ్లోబల్ సమ్మిట్‌కు రావాలంటూ ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. పార్లమెంట్‌లో ప్రధానితో జరిగిన ఈ భేటీలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ప్రధానికి అందజేశారు ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న వికసిత్ భారత్ -2047 లక్ష్యాలకు అనుగుణంగా .. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతోందని ప్రధానికి వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. నీతి అయోగ్ సలహాలు, సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణుల మేథో మథనంతో తయారు చేసిన ఈ విజన్ డాక్యుమెంట్‌ను గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరిస్తున్నట్లు ప్రధాని మోదీకి తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఈ వార్తలు కూడా చదవండి..
బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. గాంధీ భవన్ వద్ద మోహరించిన పోలీసులు
For More TG News And Telugu News