ibomma Ravi: రవికి పోలీసులు బంఫర్ ఆఫర్.. !
ABN , Publish Date - Dec 03 , 2025 | 01:28 PM
ఐ బొమ్మ రవిని తెలంగాణ పోలీసులు విచారించారు. ఈ విచారణలో పలు కీలక అంశాలు వెల్లడించారు. ఐ బొమ్మ మూసివేశాం.. తర్వాత ఏమిటంటూ అతడిని పోలీసులు ప్రశ్నించారు.
హైదరాబాద్, డిసెంబర్ 03: టెక్నాలజీపై ఉన్న పట్టుతో కొత్త సినిమాలను పైరసీ చేసి.. చిత్ర పరిశ్రమకు ఐ బొమ్మ రవి చుక్కుల చూపించారు. అలాంటి రవికి పోలీసులు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతడి తెలివితేటలను విచారణలో భాగంగా పోలీస్ ఉన్నతాధికారులు గుర్తించారు. పోలీసు శాఖలోని సైబర్ క్రైమ్ విభాగంలో పని చేస్తావా? అంటూ రవిని వారు అడిగినట్లు సమాచారం. మంచి జీతం సైతం ఇస్తామని అతడికి ఆఫర్ చేశారని తెలుస్తోంది. రవి మాత్రం వారి ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించారట.
ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు అనేక కొత్త విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా ‘ఐ బొమ్మ క్లోజ్ అయింది. కదా.. తర్వాత ఏం చేస్తావంటూ’ రవిని పోలీసులు ప్రశ్నించారు. కరేబియన్ దీవుల్లో రెస్టారెంట్ ఏర్పాటు చేస్తానని వారికి చెప్పినట్లు సమాచారం.
ఆ రెస్టారెంట్‌లో తెలంగాణ, ఆంధ్రాతోపాటు దేశంలోని వివిధ ప్రముఖ వంటకాలను ఆ దీవుల్లోని ప్రజలకు రుచి చూపించడం ద్వారా డబ్బు సంపాదిస్తానని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఆ రెస్టారెంట్‌కు ఏం పేరు పెడతావంటూ రవిని పోలీసులు ప్రశ్నించగా.. ఐ బొమ్మ పేరే పెడతానని రవి ఈ సందర్భంగా పోలీసులకు స్పష్టం చేసినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు.. స్పందించిన సీఎం
బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. గాంధీ భవన్ వద్ద మోహరించిన పోలీసులు
For More TG News And Telugu News