Share News

CM Reventh reddy: వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు.. స్పందించిన సీఎం

ABN , Publish Date - Dec 03 , 2025 | 10:33 AM

హయత్‌నగర్‌లో మూగ బాలుడు ప్రేమ్ చంద్‌పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పందించారు.

CM Reventh reddy: వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు.. స్పందించిన సీఎం

హైదరాబాద్, డిసెంబర్ 03: హయత్‌నగర్‌లో మూగ బాలుడు ప్రేమ్ చంద్‌పై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బాలుడి పరిస్థితిపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల దాడిలో గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వారిని అదేశించారు. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అతడికి అవసరమైన తక్షణ సాయం అందించాలని సూచించారు.


స్వయంగా బాలుడిని పరామర్శించటంతో పాటు, ఆ కుటుంబాన్ని కూడా కలిసి.. వారి బాగోగులు పరిశీలించి, ప్రభుత్వ పరంగా వారిని ఆదుకోవాలని కమిషనర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో జరిగిన సంఘటనలు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని. . తక్షణం వీధి కుక్కల దాడుల కట్టడికి చర్యలు చేపట్టాలని ఆయన అదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


ఇంతకు ఏం జరిగిందంటే..?

హయత్‌నగర్‌ షిర్డీ నగర్‌లో బి తిరుపతి, చంద్రకళ దంపతులు నివసిస్తున్నారు. అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌గా తిరపతి పని చేస్తున్నాడు. అతడి భార్య చంద్రకళ కూలీ పని చేస్తుంది. వీరికి ప్రేమ్‌చంద్ (8) కుమారుడు ఉన్నాడు. అతడికి మాటల రావు. మంగళవారం (2-12-2025) ఉదయం ప్రేమ్ చంద్.. తన ఇంటి సమీపంలోని కిరాణ దుకాణానికి వెళ్తున్నాడు. కుక్కల గుంపు అతడిపై మూకుమ్మడిగా దాడి చేశాయి. శీతాకాలం కావడంతో అతడు స్వెటర్ ధరించాడు.


ఆ స్వెటర్‌ను నోటితో కరిచి అతడిని కొంత దూరం లాక్కెళ్లాయి. ప్రేమ్ చంద్ మూగవాడు కావడంతో కేకలు వేయలేక నిస్సహాయంగా ఉండిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి.. రాళ్లు విసిరి కుక్కలను తరిమికొట్టారు. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి.. 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు.


ఆ వాహనంలో అతడిని ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. బాలుడికి మెరుగైన వైద్య చికిత్స కోసం నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. బాలుడి చెవకి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆ బాలుడిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అతడి తల్లిదండ్రులు వెల్లడించారు. ఈ సంఘటనపై పత్రికలో వార్త కథనాలు వెలువడడంతో సీఎం రేవంత్ రెడ్డి పైవిధంగా స్పందించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బీజేపీకి తెలంగాణ రుచి చూపిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో రాత్రివేళా సంపద సృష్టి.. రేవంత్ సర్కారు వ్యూహరచన

For More TG News And Telugu News

Updated Date - Dec 03 , 2025 | 10:59 AM