Share News

TG GOVT: గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం..!

ABN , Publish Date - Dec 05 , 2025 | 12:32 PM

రాష్ట్రంలో మూడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలో లక్ష ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధం అవుతాయని పేర్కొన్నారు.

TG GOVT: గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం..!
Indiramma Housing Scheme

హైదరాబాద్, డిసెంబరు5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) వ్యాఖ్యానించారు. త్వరలో లక్ష ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధం అవుతాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మూడు లక్షల ఇళ్లకు గృహప్రవేశం పూర్తి అవుతుందని వివరించారు. వచ్చే ఏప్రిల్‌ నాటికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు. ఇవాళ(శుక్రవారం) తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.


ప్రణాళికలు చేస్తున్నాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Minister Ponguleti Srinivas Reddy

కోర్ అర్బన్ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా ప్రణాళిక సిద్ధమైందని వెల్లడించారు. గ్రౌండ్ ప్లస్ ఫోర్ బిల్డింగ్ నిర్మించి పేదలకు ఇచ్చే ప్రణాళికలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. త్వరలో అర్బన్ ప్రణాళిక ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఓ ఆర్ ఆర్‌కు ఆనుకుని నలువైపులా ఉన్న స్థలాల్లో ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఒక్కో చోట 10వేల ఇళ్లు నిర్మించి నో ప్రాఫిట్, నో లాస్ కింద మధ్యతరగతి ప్రజలకు ఇస్తామని వివరించారు. గ్లోబల్ సమ్మిట్‌లో ప్రణాళికలు ప్రకటిస్తామని పేర్కొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.


కేసీఆర్ ప్రభుత్వంలో హౌసింగ్ శాఖ నిర్వీర్యం..

గత కేసీఆర్ ప్రభుత్వం హౌసింగ్ శాఖను నిర్వీర్యం చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్ శాఖను తిరిగి తాము బలోపేతం చేశామని వివరించారు. గతంలో నిర్మించి మధ్యలో వదిలేసిన ఇళ్లకు కూడా ఇందిరమ్మ పథకం వర్తింపజేయాలని తాము ఆలోచిస్తున్నామని చెప్పుకొచ్చారు. రూరల్‌లో, అర్బన్‌లో ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు కూడా త్వరలో శుభవార్త చెబుతామని పేర్కొన్నారు. ఒక విడతలోనే ఇళ్లు ఇచ్చి తాము చేతులు దులుపుకోమని చెప్పుకొచ్చారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.


కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు..

హిల్ట్‌పాలసీపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. హిల్ట్ పాలసీపై కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే హిల్ట్ పాలసీ రద్దు చేస్తామని అంటున్నారని... నోటికొచ్చినట్లుగా కేటీఆర్ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అని.. వారి హయాంలో ఇష్టం వచ్చినట్లుగా చేశారని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం చాలా వినూత్న నిర్ణయాలు తీసుకుంటుందని.. కేసీఆర్ హయాంలో లాగా తాము చేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ.. ఎందుకంటే

నా వ్యాఖ్యలపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్

For More TG News And Telugu News

Updated Date - Dec 05 , 2025 | 12:57 PM