Share News

Telangana: కేసీఆర్‌ను అసెంబ్లీలో చూసుకుంటాం: మంత్రి కోమటిరెడ్డి

ABN , Publish Date - Dec 28 , 2025 | 09:39 PM

తెలంగాణలో మళ్లీ రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తనకు పదువులు ముఖ్యం కాదని.. నల్లగొండ ప్రజలే తన ప్రాణం అని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పేరు వస్తుందని పదేళ్లలో..

Telangana: కేసీఆర్‌ను అసెంబ్లీలో చూసుకుంటాం: మంత్రి కోమటిరెడ్డి
Minister Komatireddy Venkat Reddy

నల్లగొండ, డిసెంబర్ 28: తెలంగాణలో మళ్లీ రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తనకు పదువులు ముఖ్యం కాదని.. నల్లగొండ ప్రజలే తన ప్రాణం అని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పేరు వస్తుందని పదేళ్లలో ఎస్ఎల్‌బీసీని కేసీఆర్ పక్కన పెట్టారని ఆరోపించారు. కానీ, రెండేళ్లలోఎస్ఎల్‌బీసీని పూర్తి చేసి నల్లగొండ జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. త్యాగాల గురించి సోనియా గాంధీని చూసి నేర్చుకోవాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. పేదవాళ్లకు భరోసానిచ్చే ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకునేదుకు అంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారాయన. అభివృద్ధి ఒక్కటే ముఖ్యం అని.. పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పారు. తన వాళ్లకు పదువులు రాలేదని.. తాను ఢిల్లీకి వెళ్లక ముందే మంత్రి పదవి వచ్చిందన్నారు.


కేసీఆర్‌ను అసెంబ్లీలో చూసుకుంటా..

విపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని జరుగుతున్న ప్రచారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. కేసీఆర్‌ను అసెంబ్లీలో చూసుకుంటానని అన్నారు. ఉతికి ఆరేస్తామని వ్యాఖ్యానించారు. కేసీఆర్ గడిచిన 24 నెలలు అసెంబ్లీకి రాకుండానే రూ. 1.20 కోట్లు జీతం తీసుకున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్న 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ. 100 కోట్లు ఇచ్చి కొనుక్కుపోయారన్నారు. అయినా తాము అసెంబ్లీకి వచ్చామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఆయన అల్లుడు, కొడుకు దోచుకున్నారని ఆరోపించిన మంత్రి.. ఆయన బిడ్డ కవిత అడిగిన పంపకాల లెక్కలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


Also Read:

AI Meme Fest Online: ఏఐతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. యువతికి షాకుల మీద షాకులు

CM Chandrababu: నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఎందుకంటే..

Nandyal District: నంద్యాలలో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి కాలువలో దూకిన తల్లి..

Updated Date - Dec 28 , 2025 | 09:39 PM