Share News

AI Meme Fest Online: ఏఐతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. యువతికి షాకుల మీద షాకులు

ABN , Publish Date - Dec 28 , 2025 | 09:32 PM

సంస్కృతి నరుక అనే యువతి కొండ ప్రాంతంలో ఫొటో దిగి దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఆ ఫొటోలో ఆమె వెనకాల ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తిని తన వెనకాల లేకుండా చేయమని ఆ యువతి నెటిజన్లను కోరింది. దీంతో నెటిజన్లు రెచ్చిపోయారు.

AI Meme Fest Online: ఏఐతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. యువతికి షాకుల మీద షాకులు
AI Meme Fest Online

ఈ మధ్య కాలంలో అన్ని రంగాల్లో ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కంపెనీలు తమ మ్యాన్ పవర్‌ను తగ్గించుకోవడానికి, ఉత్పాదకతను పెంచుకోవటానికి ఏఐని ఆశ్రయిస్తున్నారు. అమెరికా, యూకే వంటి ఫారెన్ కంట్రీస్‌లో ఏఐని ఎక్కువగా డబ్బు సంపాదన, కెరీర్ గురించి వాడుతున్నారు. ఇండియాలో మాత్రం కొంతమంది అదే పనిగా ఏఐని ఫేక్ వీడియోలు, ఫొటోలు తయారు చేయడానికి వాడుతున్నారు. కొంతమంది ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చేస్తుంటే.. మరికొంతమంది ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ఏఐని వాడుకుంటున్నారు.


తాజాగా, సంస్కృతి నరుక అనే యువతి కొండ ప్రాంతంలో ఫొటో దిగి దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఆ ఫొటోలో ఆమె వెనకాల ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతడు బిజీగా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిని తన వెనకాల లేకుండా చేయమని ఆ యువతి నెటిజన్లను కోరింది. అంతే.. నెటిజన్లు ఆమెకు ఏఐతో షాకుల మీద షాకులు ఇచ్చారు. అలోక్ మోహన్ కర్లా అనే వ్యక్తి ఏఐ సాయంతో ఆ యువతి మోదీతో ఫొటో దిగినట్లు ఇమేజ్ క్రియేట్ చేశాడు. మరో వ్యక్తి వెనకాల ఉన్న వ్యక్తిని యువతి ముందుకు తీసుకువచ్చాడు.


స్రూమ్స్ బిర్యానీ అనే ఖాతాదారుడు ఏకంగా ఇద్దరూ సెల్పీ దిగుతున్నట్లు వీడియో క్రియేట్ చేశాడు. ఇబ్రహీం అనే వ్యక్తి ఏకంగా ఆ అమ్మాయి వెనకాల ఉన్న వ్యక్తితో మందు సిట్టింగ్ వేసినట్లు ఫొటో క్రియేట్ చేశాడు. ఇక్కడ మరీ దారుణం ఏంటంటే.. పచ్చీస్ కీ పటాకా అనే ఖాతాదారుడు ఇద్దరికీ పెళ్లి అయినట్లు ఇమేజ్ క్రియేట్ చేశాడు. ఆ ఫొటోలు చూసి సంస్కృతి నరుక షాక్ అయింది. ఒకరకంగా కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిపై స్పందిస్తున్న నెటిజన్లు .. ఏఐతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

నంద్యాలలో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి కాలువలో దూకిన తల్లి..

భారత్‌పై కక్ష గట్టిన ట్రంప్.. 2025లో జరిగిందిదే..

Updated Date - Dec 28 , 2025 | 09:36 PM