Share News

Nandyal District: నంద్యాలలో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి కాలువలో దూకిన తల్లి..

ABN , Publish Date - Dec 28 , 2025 | 09:09 PM

నంద్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన గడివేముల మండలం మంచాలకట్ట సమీపంలోని ఉండుట్ల గ్రామానికి సమీపంలో జరిగింది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది..

Nandyal District: నంద్యాలలో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి కాలువలో దూకిన తల్లి..

నంద్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన గడివేముల మండలం మంచాలకట్ట సమీపంలోని ఉండుట్ల గ్రామానికి సమీపంలో జరిగింది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ (SRBC)లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఉండుట్లకు చెందిన లక్ష్మీదేవి (25) తన కుమార్తెలు వైష్ణవి (3), సంగీతను (4 నెలలు) కాలువలో తోసేసి.. ఆ తర్వాత తాను కూడా దూకి ప్రాణాలు తీసుకుంది.


సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు కలిసి కెనాల్‌లో గాలింపు ఆపరేషన్ చేపట్టారు. మృతదేహాల కోసం శోధన కొనసాగుతోంది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మృతదేహాల వెలికతీత కష్టంగా మారింది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సమస్యలు లేదా ఇతర కారణాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. చిన్న పిల్లలతో కలిసి ఓ తల్లి ఇలా ఆత్మహత్యకు పాల్పడటం గ్రామంలోనే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల్లో విషాదం నెలకొంది.


ఇవి కూడా చదవండి...

వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి కీలక నేతలు

ఈ ఏడాది ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి

Read Latest AP News And Telugu New

Updated Date - Dec 28 , 2025 | 09:09 PM