Share News

Harish Rao Fires on Congress: బీఆర్‌ఎస్‌ పార్టీకి కేసీఆరే సుప్రీం: హరీష్‌రావు

ABN , Publish Date - Sep 05 , 2025 | 11:09 AM

మేడిగడ్డ మూడు పిల్లర్లు కుంగితే రేవంత్‌రెడ్డి సర్కార్ రాద్ధాంతం చేస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వానాకాలంలో విద్యుత్‌ డిమాండ్‌ ఉండదని హరీష్‌రావు చెప్పుకొచ్చారు.

Harish Rao Fires on Congress: బీఆర్‌ఎస్‌ పార్టీకి కేసీఆరే సుప్రీం: హరీష్‌రావు
Harish Rao Fires on Congress

అమరావతి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీకి అధినేత కేసీఆరే సుప్రీం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) ఉద్ఘాటించారు. ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదేనని స్పష్టం చేశారు. లండన్‌లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం ఇవాళ(శుక్రవారం) నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్‌రావు పాల్గొని మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడమే తనకు కేసీఆర్‌ నేర్పించారని నొక్కిచెప్పారు.


మేడిగడ్డ మూడు పిల్లర్లు కుంగితే రేవంత్‌రెడ్డి సర్కార్ రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు. ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వానాకాలంలో విద్యుత్‌ డిమాండ్‌ ఉండదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో బాహుబలి మోటార్లతో నీటిని ఎత్తిపోసుకోవచ్చని తెలిపారు. హైడ్రాతో హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలిందని విమర్శించారు. ఎన్నారైలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు ఎందుకు పెట్టడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్‌రావు ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించాలి

‘గే’ యాప్‌ ‘గ్రైండర్‌’ ద్వారా డ్రగ్స్‌ విక్రయం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 05 , 2025 | 12:01 PM