Share News

Station Ghanpur Politics: స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఫ్లెక్సీ పాలిటిక్స్... వైరల్

ABN , Publish Date - Dec 20 , 2025 | 02:34 PM

స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్‌ఎస్ నేతలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Station Ghanpur Politics: స్టేషన్‌  ఘన్‌పూర్‌లో ఫ్లెక్సీ పాలిటిక్స్... వైరల్
Station Ghanpur Politics

జనగామ, డిసెంబర్ 20: జిల్లాలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఫ్లెక్సీల రాజకీయం హాట్‌టాపిక్‌గా మారింది. తిరుమలనాథ స్వామి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ శ్రీకారోత్సవానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి (Kadiyam Srihari) స్వాగతం అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ రాజకీయంగా చర్చకు దారితీసింది. ఫ్లెక్సీతో బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తమ పార్టీలోనే ఉన్నట్టు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు లిఖితపూర్వకంగా కడియం శ్రీహరి వివరణ ఇవ్వడంతో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.


ఓవైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫోటో.. మరోవైపు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్టేషన్ ఘన్‌పూర్‌ ఫ్లెక్సీ పాలిటిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి...

ఏకంగా ఆస్పత్రిలోనే డ్రగ్స్ వినియోగం.. వ్యక్తి అరెస్ట్

సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 20 , 2025 | 02:52 PM