Drug Bust: ఏకంగా ఆస్పత్రిలోనే డ్రగ్స్ వినియోగం.. వ్యక్తి అరెస్ట్
ABN , Publish Date - Dec 20 , 2025 | 10:44 AM
నగరంలోని ఎస్‌ఆర్ నగర్‌లో డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కేఫిటేరియా మేనేజర్ వద్ద డ్రగ్స్ పట్టుబడింది.
హైదరాబాద్, డిసెంబర్ 20: మరికొద్దిరోజుల్లో నూతన సంవత్సరం రానుంది. దీంతో డ్రగ్స్ మూలాలపై ఇప్పటికే నార్కొటిక్స్ బ్యూరోతో పాటు హైదరాబాద్ పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో నగరంలోని ఓ ఆస్పత్రిలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఎస్‌ఆర్ నగర్ పరిధిలోని ప్రైవేటు ఆస్పత్రిలో కేఫిటేరియా మేనేజర్ వద్ద డ్రగ్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మేనేజర్ ఆసిఫ్ వద్ద ఎమ్‌డీఎమ్‌ఏ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
గత కొంతకాలంగా ఆసిఫ్ వ్యక్తిగతంగానే డ్రగ్స్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి సేవిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాయి. అయితే ఎమ్‌డీఎమ్‌ఏ డ్రగ్ ఎవరి ద్వారా ఆసిఫ్‌కు సరఫరా అవుతుందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లో ప్రతీ సారి డ్రగ్స్ వినియోగం భారీగా ఉంటోంది. ఈ ఏడాది ఎక్కడా కూడా డ్రగ్స్ మాట వినపడొద్దనే ఉద్దేశంతో పోలీసులు నిఘా కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా డ్రగ్స్ తీసుకుంటున్న ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారిస్తున్నారు పోలీసులు. అతడిచ్చే సమాచారంతో మరి కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
శ్రీశైలంలో ఇలాంటివి చేయొద్దు.. చర్యలు తప్పవు.. ఈవో కీలక ఆదేశాలు
తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. సాగునీటి హక్కులపై సమరశంఖం
Read Latest Telangana News And Telugu News