KCR: తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. సాగునీటి హక్కులపై సమరశంఖం
ABN , Publish Date - Dec 20 , 2025 | 10:12 AM
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగనుంది. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 20: ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి తర్వాత గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమావేశాలు, పార్టీ నేతలతో సమావేశాలను కూడా అక్కడి నుంచే నిర్వహిస్తూ వస్తున్నారు కేసీఆర్. ఈ రెండేళ్లలో కేసీఆర్ ప్రజలకు కనిపించింది చాలా అరుదనే చెప్పుకోవాలి. అయితే తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. రేపు (ఆదివారం) తెలంగాణ భవన్‌కు బీఆర్‌ఎస్ అధినేత రానున్నారు.
కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్‌ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగనుంది. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమంపై మాజీ సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో 45 టీఎంసీలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుందనేది బీఆర్‌ఎస్ వాదన. నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడీకి కేంద్రం సహకరిస్తోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్రాం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా నోరు మెదపటం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్, బీజేపీలను తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబెడతామని బీఆర్‌ఎస్ చెబుతోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళనలపైనా కేసీఆర్ దృష్టి సారించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. చాలా రోజుల తర్వాత తమ అధినేత తెలంగాణ భవన్‌కు రానుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.
ఇవి కూడా చదవండి...
ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం..ఆదుకోండి!
శ్రీశైలంలో ఇలాంటివి చేయొద్దు.. చర్యలు తప్పవు.. ఈవో కీలక ఆదేశాలు
Read Latest Telangana News And Telugu News