AP Schools: ఇకపై అన్ని స్కూళ్లల్లో ‘ముస్తాబు’.. సర్కార్ ఉత్తర్వులు జారీ
ABN , Publish Date - Dec 20 , 2025 | 09:51 AM
ఏపీ వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ , ప్రైవేటు, గురుకులాలు, వసతి గృహాలు, కళాశాలల్లో తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది.
అమరావతి, డిసెంబర్ 20: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో సరికొత్త కార్యక్రమానికి ప్రభుత్వం (AP Govt) శ్రీకారం చుట్టింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్కూల్ పిల్లల్లో వ్యక్తిగత పరిశుభ్రత తీసుకురావడంతో పాటు పర్యవేక్షణ చేసేందుకు ముస్తాబు కార్యక్రమాన్ని అమలులోకి తీసుకొచ్చింది. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని తరగతుల్లో వెంటనే అమల్లోకి తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పార్వతీపురం మన్యం జిల్లాలో ముస్తాబు కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి విజయవంతంగా అమలు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సత్పలితాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల్లో అమల్లోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ, ఎయిడెడ్ , ప్రైవేటు, గురుకులాలు, వసతి గృహాలు, కళాశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయాలని సర్కార్ స్పష్టం చేసింది.
కార్యక్రమం అమలు చేసే తీరు, విధివిధానాలు తెలియజేస్తూ వెంటనే అమల్లోకి తేవాలని ఆదేశాలు జారీ చేసింది. పిల్లల్లో వ్యక్తిగత పరిశుభ్రత పెంచడం సహా క్రమశిక్షణ , మంచి వ్యక్తిత్వం అలవర్చేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
వణికిస్తున్న కోల్డ్‌వేవ్.. కనిష్ఠ స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. భయాందోళనలో ప్రజలు
శ్రీశైలంలో ఇవి చేయొద్దు.. చర్యలు తప్పవు.. ఈవో కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News