Diesel Theft: బాబోయ్.. ఈ దొంగల రూటే వేరు.. విస్తుపోవడం ఖాయం
ABN , Publish Date - Dec 20 , 2025 | 08:13 AM
కోడుమూరు పట్టణంలో డీజిల్ దొంగలు పడ్డారు. గురువారం అర్థరాత్రి రోడ్డుపై ఉన్న పలు లారీల డీజిల్ ట్యాంకులను పగులగొట్టి దొంగలు డీజిల్ ఎత్తుకెళ్లారు. నంద్యాలకు చెందిన సత్యరాజ్ అనే డ్రైవర్ తన లారీలో మొక్కజొన్నను లోడ్ చేసుకొని ఆదోనికి వెళ్లారు.
కోడుమూరు, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): కోడుమూరు పట్టణంలో డీజిల్ దొంగలు పడ్డారు. గురువారం అర్థరాత్రి రోడ్డుపై ఉన్న పలు లారీల డీజిల్ ట్యాంకులను పగులగొట్టి దొంగలు డీజిల్ (Diesel Theft) ఎత్తుకెళ్లారు. నంద్యాలకు చెందిన సత్యరాజ్ అనే డ్రైవర్ తన లారీలో మొక్కజొన్నను లోడ్ చేసుకొని ఆదోనికి వెళ్లారు. అక్కడ అన్‌లోడ్ చేసి తిరిగి వస్తూ గురువారం రాత్రి ఆదోనిలో పెట్రోల్ బంకులో 200 లీటర్ల డీజిల్ కొట్టించుకొని కోడుమూరు మీదుగా నంద్యాలకు ప్రయాణం అయ్యాడు.
నిద్ర వస్తుండటంలో రాత్రి ఒంటి గంటకు కోడుమూరు పట్టణం దాటి అర కిలోమీటరు దూరంలో రోడ్డు పక్కన లారీని ఆపాడు. లారీలోనే నిద్రపోయాడు. ఉదయం నిద్రలేచి లారీని స్టార్ట్ చేస్తే కదల్లేదు. అనుమానం వచ్చి డీజిల్ ట్యాంకు వైపు చూశాడు. ట్యాంక్ మూతను పగులగొట్టి అందులోని రూ.20వేల లీటర్ల డీజిల్ దోచుకెళ్లారని డ్రైవర్ వాపోయాడు. దొంగలు మరో రెండు లారీల్లో కూడా డీజిల్‌ను దోచుకెళ్లినట్లు మరో ఇద్దరు డ్రైవర్లు తెలిపారు పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ పెంచి డీజిల్ దొంగలను పట్టుకోవాలని వాహనదారులు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ
పోలీసుల కస్డడీకి కీలక మావోయిస్టులు..
Read Latest AP News And Telugu News