Hyderabad: వృద్ధురాలిపై వీధికుక్క దాడి..
ABN , Publish Date - Dec 20 , 2025 | 10:29 AM
నగరంలో.. వీధికుక్కల బెడద ఎక్కువైంది. నిత్యం ఎక్కడో ఓచోట, ఎవరో ఒకరు కుక్కకాటుకు బలవుతూనే ఉన్నారు. తాజాగా ఓ ఏరియాలో వృద్ధురాలిని కుక్క దాడి చేసి గాయపరిచింది. భీమవరం నుంచి బంధువుల ఇంటికి వచ్చిన ఆమెను కుక్కలు దాడి చేశాయి.
- కాలిపై తీవ్రగాయాలు.. ఆసుపత్రికి తరలింపు
- ఇప్పటికే 12 మందిని కరిచిన గ్రామసింహం
- ఆందోళనకు గురవుతున్న జయభేరి పార్కు వాసులు
హైదరాబాద్: ఇంటి గేటు తీసుకొని బయటకు వస్తున్న వృద్ధురాలిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం.. కొంపల్లి సర్కిల్(Kompally Circle) పరిధిలోని జయభేరి పార్కులోని ఆంజనేయస్వామి గుడి ఎదురుగా ఉన్న ఇంటి వద్ద వాచ్‌మెన్‌గా ఉంటున్న తన కుమారుడి వద్దకు ఆరోగ్యం బాగాలేక పోవడంతో భీమవరం(Bhimavaram) నుంచి చిలుకలపల్లి చిన్నమ్మ (75) రెండు రోజుల క్రితం వచ్చింది.
శుక్రవారం సాయంత్రం ఆమె తన కొడుకు ఉంటున్న ఇంటి గేటు తీసి బయటకు వస్తుండగా, అటుగా వచ్చిన కుక్క దాడి చేసి కాలిపై తీవ్రంగా గాయపరిచింది. చికిత్స నిమిత్తం ఆమెను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఇలా ఉండగా, ఇదే వీధిలో మూడు రోజుల క్రితం బిందూ దేవి అనే మహిళ తన కుమార్తెను స్కూల్‌కు తీసుకెళ్తుండగా ఆమెపై కుక్క దాడి చేయడంతో తీవ్రగాయాల పాలైంది.

ఇప్పటికే ఈ వీధి శునకం 12 మందిపై దాడి చేసిందని స్ధానికులు చెప్పారు. వీధి కుక్క కారణంగా ఈ ప్రాంతంలోని స్కూళ్లకు వెళ్లే వి ద్యార్థులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారని వారు తెలిపారు. జయభేరి పార్కులో ఇటీవల కుక్కల బెడద ఎక్కువైందని, సంబంధిత అధికారులు వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం..ఆదుకోండి!
బ్యాంకింగ్ వదిలి చాక్లెట్ మేకింగ్
Read Latest Telangana News and National News