Home » Flexie
స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్‌ఎస్ నేతలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
YSRCP Flexi: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పెద్ద దుమారం చెలరేగింది. సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. జీవన్ రెడ్డిని కూల్ చేసేందుకు మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రంగంలోకి దిగారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సవాళ్ల పర్వం కొనసాగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం అసెంబ్లీలో గెలిస్తే ఆయన కాళ్ల వద్ద పడి ఉంటానని వైసీపీ నేత కొడాలి నాని సవాల్ విసిరారు. కుప్పంలో చంద్రబాబు రికార్డు విజయంతో గెలుపొందారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది.
Andhrapradesh: ఏపీలో ఫ్లెక్సీల వివాదం కొనసాగుతూనే ఉంది. ఏదో ఒక చోట టీడీపీకి చెందిన ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడం వివాదాలకు దారి తీస్తోంది. అధికారపార్టీకి చెందిన ఫ్లెక్సీలను తొలగించకుండా.. టీడీపీ ఫ్లెక్సీలను అధికారులు తొలగించడం పట్ల ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద కరకట్టపై ఉన్న లోకేష్, చంద్రబాబు ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు.
Andhrapradesh: జిల్లాలోని మచిలీపట్నంలో ప్లెక్సీల రాజకీయం తారాస్థాయికి చేరింది. టీడీపీ ఏర్పాటు చేసిన ప్లెక్సీలను అధికార పార్టీ వైసీపీ టార్గెట్ చేసింది. ఎమ్మెల్యే పేర్ని నాని మౌఖిక ఆదేశాలతో టీడీపీ ప్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగింపు చర్యలకు పాల్పడ్డారు. ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ నాయకులు ప్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్...: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుసగా ప్రసారం చేసిన కథనాలతో వైసీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రకాశం జిల్లా, ఒంగోలులో ఏర్పాటు చేసిన సీఎం జగన్ ఫ్లెక్సీలను వైసీపీ నేతలు రాత్రికి రాత్రి తొలగించారు. జగన్‌ను ఏసుక్రీస్తుతో పోలుస్తూ వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
వైసీపీ(YCP) గూoడాలను పోలీస్ స్టేషన్‌కి పంపించి జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) ప్రజాస్వామ్యం ఖూనీకి యత్నించారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) మండిపడ్డారు.
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నగరంలో పోటా పోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. బీఆర్ఎస్ నేతలు నగరవ్యాప్తంగా ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
గుంటూరు జిల్లాలో కృష్ణయపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూసి జనాలు నవ్వుకుంటున్న పరిస్థితి.