KTR Flexies: హైదరాబాద్‌లో ఇష్టారాజ్యంగా కేటీఆర్ ఫ్లెక్సీలు.. మండిపడుతున్న నగరవాసులు

ABN , First Publish Date - 2023-07-24T11:14:00+05:30 IST

మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నగరంలో పోటా పోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. బీఆర్ఎస్ నేతలు నగరవ్యాప్తంగా ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

KTR Flexies: హైదరాబాద్‌లో ఇష్టారాజ్యంగా కేటీఆర్ ఫ్లెక్సీలు.. మండిపడుతున్న నగరవాసులు

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ (Minister KTR) పుట్టినరోజు సందర్భంగా నగరంలో పోటా పోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. బీఆర్ఎస్ నేతలు నగరవ్యాప్తంగా ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే నగరంలో ఫ్లెక్సీలను నిషేధిస్తూ గతంలో మంత్రి కేటీఆర్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తమ వరకు వచ్చేసరికి ఇవేమీ లెక్కచేయని బీఆర్‌ఎస్‌ నేతలు.. మంత్రి పుట్టిన రోజును పురస్కరించుకుని భారీ ఫ్లెక్సీలు, పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేశారు. వీటిపై జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోని పరిస్థితి. ఎలాంటి పెనాల్టీలు వేయకుండా జీహెచ్ఎంసీ అధికారులు చేతులు దులుపుకోవడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు, కటౌట్ల ఏర్పాటు ప్రమాదకరంగా మారాయి. మరోవైపు సిటీలో భారీగా ఈదురు గాలులు వీస్తాయన్న వాతావరణశాఖ ఇప్పటికే ప్రకటించింది. దీంతో గాలులకు కుప్పకూలిపోయేలా ప్రమాదకరంగా ఫ్లెక్సీలు ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై నగరవాసులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Updated Date - 2023-07-24T11:14:00+05:30 IST