Jagan Flexi: వైసీపీ కార్యకర్తల వీరంగం.. జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం
ABN , Publish Date - Dec 27 , 2025 | 10:54 AM
నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో వైసీపీ కార్యకర్తలు వీరంగం చేశారు. జగన్ ఫ్లెక్సీ వద్ద మేకపోతును నరికి ఆ రక్తంతో జగన్ చిత్రపటానికి అభిషేకం చేశారు. మేకపోతు తలకాయ పట్టుకుని వీరంగం సృష్టించారు.
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 27: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. నిన్న (శుక్రవారం) రాత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటం ఉన్న ఫ్లెక్సీ వద్ద మేకపోతును నరికి, ఆ రక్తంతో వైఎస్ జగన్‌కు రక్తాభిషేకం చేశారు. ఓ కార్యకర్త మేక తల పట్టుకుని వీరంగం సృష్టించాడు. జగన్ పుట్టినరోజు (డిసెంబర్ 21) జరిగి ఆరు రోజులు దాటినా, '2029లో గంగమ్మ జాతర రప్ప రప్ప' అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇటీవల జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి జంతు బలి ఘటనలు జరిగి, అనేక చోట్ల వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఈ చర్యలు స్థానిక ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి రాజకీయ వేడుకలు శాంతియుతంగా జరపాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరల్లో 5 రోజులుగా ర్యాలీ! ప్రస్తుత రేట్స్ ఇవీ..
3, 4, 5 తేదీల్లో మూడవ తెలుగు మహాసభలు
Read Latest Telangana News and National News