Share News

AP Politics: మళ్లీ అదే సీన్.. మరోసారి టీడీపీ ఫ్లెక్సీల తొలగింపు

ABN , Publish Date - Mar 13 , 2024 | 11:18 AM

Andhrapradesh: ఏపీలో ఫ్లెక్సీల వివాదం కొనసాగుతూనే ఉంది. ఏదో ఒక చోట టీడీపీకి చెందిన ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడం వివాదాలకు దారి తీస్తోంది. అధికారపార్టీకి చెందిన ఫ్లెక్సీలను తొలగించకుండా.. టీడీపీ ఫ్లెక్సీలను అధికారులు తొలగించడం పట్ల ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద కరకట్టపై ఉన్న లోకేష్, చంద్రబాబు ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు.

AP Politics: మళ్లీ అదే సీన్.. మరోసారి టీడీపీ ఫ్లెక్సీల తొలగింపు

అమరావతి, మార్చి 13: ఏపీలో (Andhrapradesh) ఫ్లెక్సీల వివాదం కొనసాగుతూనే ఉంది. ఏదో ఒక చోట టీడీపీకి (TDP) చెందిన ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడం వివాదాలకు దారి తీస్తోంది. అధికారపార్టీకి చెందిన ఫ్లెక్సీలను తొలగించకుండా.. టీడీపీ ఫ్లెక్సీలను అధికారులు తొలగించడం పట్ల ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద కరకట్టపై ఉన్న లోకేష్, చంద్రబాబు ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. అయితే కరకట్టపై ఉన్న వైసీపీ (YSRCP) ఫ్లెక్సీలను అధికారులు తొలగించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. మున్సిపల్ సిబ్బందిని వెంట తీసుకొచ్చి మరీ పోలీసులు.. అక్కడి హోర్డింగ్‌లను తొలగించి పక్కన పడేశారు. అధికారుల తీరు పట్ల తెలుగుదేశం నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ బొమ్మతో ఉన్న వైసీపీ ఫ్లెక్సీలు అధికారులకు కనిపించట్లేదా అంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి...

TS Politics: కారు దిగిన నేతలకే టికెట్లు

Kejriwal: వారి కోసం బీజేపీ తలుపులు తెరిచింది.. సీఏఏపై కేజ్రీవాల్ కన్నెర్ర..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 13 , 2024 | 11:21 AM