Kishan Reddy: సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:42 AM
కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్‌తో బీజేపీకి పొత్తు ఉందంటూ పనిలేని వాళ్లు చేసిన ఆరోపణలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 20: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో (ABN - Andhrajyothy) మాట్లాడుతూ.. పసలేని, తెలివి తక్కువ వాళ్ళు బీఆర్ఎస్‌తో బీజేపీకి పొత్తు ఉందని మాట్లాడుతారని మండిపడ్డారు. ఎవరితో బీజేపీ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అడిగితే తప్పేంటి ప్రశ్నించారు. గతంలో సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై కూడా అడిగారని గుర్తుచేశారు. పసలేని వాళ్లు తమ మీద ఆరోపణలు చేస్తే జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
రాజకీయ విమర్శలు మాని ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని హితవుపలికారు. ఆదాయం వ్యక్తిగత అవసరాల కోసం జీహెచ్ఎంసీలో మునిసిపాలిటీలు , కార్పొరేషన్ల విలీనం చేశారని.. దీనిపై మొదటి నుంచి బీజేపీ అభ్యంతరం చెబుతోందన్నారు. గ్రామాల్లో గెలిచిన సర్పంచ్‌లను డబ్బు ఆశ , ఇతర అంశాలను సాకుగా చూపి కాంగ్రెస్‌లోకి రావాలని కోరుతున్నారని మండిపడ్డారు.
గ్రామ పంచాయితీలకు రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏం ఉండదన్నారు. గ్రామంలోని ప్రతి అభివృద్ధికి కేంద్ర నిధులే ప్రధానమని స్పష్టం చేశారు. బీజేపీలో గెలిచిన సర్పంచ్‌లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల మీద అవగాహన ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. సాగునీటి హక్కులపై సమరశంఖం
ఏకంగా ఆస్పత్రిలోనే డ్రగ్స్ వినియోగం.. వ్యక్తి అరెస్ట్
Read Latest Telangana News And Telugu News